Delhi Capitals : ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ఆటగాళ్లు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా తాము భాగమైన జట్లలోకి చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ మినహా మిగతా అన్ని జట్లు తమ కెప్టెన్లు ఎవరో ప్రకటించాయి. ఢిల్లీ మాత్రం ఆ విషయంలో సస్పెన్స్ పాటిస్తోంది. ఢిల్లీ జట్టుకు గతంలో రిషబ్ పంత్ కెప్టెన్ గా ఉండేవాడు. అయితే అతడిని లక్నో జట్టు కొనుగోలు చేసింది. మరోవైపు ఢిల్లీ జట్టులో అక్షర్ పటేల్ కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో ఢిల్లీ యాజమాన్యం కేఎల్ రాహుల్ ను కొనుగోలు చేసింది. అయితే కెప్టెన్సీ విషయంలో రాహుల్ లేదా అక్షర్ పటేల్ కు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ భావించినట్టు తెలుస్తోంది . అయితే ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్ కు మరింత పదును పెట్టుకోవాలని రాహుల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే అతడు కెప్టెన్సీ వద్దని ఢిల్లీ మేనేజ్మెంట్ తో చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో అక్షర్ పటేల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. దానికి అక్షర్ పటేల్ కూడా సుముఖంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక రేపో మాపో అక్షర్ పటేల్ ను అధికారికంగా కెప్టెన్ గా ప్రకటించడమే మిగిలి ఉంది అనుకుంటున్న తరుణంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మేనేజ్మెంట్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
Also Read : పుష్ప కాదు.. డాలీ అంటేనే ఓ బ్రాండ్.. ఏకంగా దుబాయ్ మైదానాన్నే దున్నేశాడుగా..
కెప్టెన్ అయ్యేది అతడే నట
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) కు కెప్టెన్ అయ్యేది అక్షర, రాహుల్ కాదట. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ రేస్ లో ఫాప్ డూ ప్లె సిస్ ఉన్నట్టు తెలుస్తోంది.ఫాప్ డూ ప్లె సిస్ గత సీజన్ దాకా బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించాడు.. అయితే ఇటీవల వేలంలో బెంగళూరు జట్టు అతడిని వదులుకుంది. దీంతో ఢిల్లీ జట్టు అతడిని కొనుగోలు చేసింది.. రాహుల్ కెప్టెన్సీ విషయంలో నో చెప్పడంతో.. అక్షర్ పటేల్ కు అంతగా అనుభవం లేకపోవడంతో.. ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ ఫాప్ డూ ప్లె సిస్ కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఫాప్ డూ ప్లె సిస్ ఆధ్వర్యంలో బెంగళూరు జట్టు 2022, 2024 సీజన్లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. ఫాప్ డూ ప్లె సిస్ నాయకుడిగా మాత్రమే కాకుండా.. ఆటగాడిగా కూడా ఆకట్టుకుంటాడు.. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తాడు.. ఐపీఎల్ లో మాత్రమే కాకుండా అనేక ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో ఫాప్ డూ ప్లె సిస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతడికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ ఒక క్లారిటీ ఇస్తుందని సమాచారం.
Also Read : ఈసారి SRH ఐపీఎల్ షెడ్యూల్ ఎలా ఉందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మ్యాచ్ లు జరుగుతాయంటే..