Delhi : కరుణ్ నాయర్(0), అభిషేక్ పోరెల్ (8), డూ ప్లెసిస్(3) వికెట్లను పడగొట్టాడు. ఈ ముగ్గురి క్యాచ్ లను కూడా ఇషాన్ కిషన్ పట్టుకోవడం విశేషం. ఇక అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, విప్రజ్ నిగమ్ ఇలా కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో.. ఢిల్లీ జట్టుకు ఊహించని షాక్ లు తగిలాయి.. 12.1 ఓవర్లకే 62 రన్స్ స్కోర్ చేసి ఆరు వికెట్లు లాస్ అయ్యింది. ఢిల్లీ క్యాప్టెన్ జట్టు ఉన్న పరిస్థితి చూస్తే కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఈ దశలో ఢిల్లీ బ్యాటర్లు అశుతోష్ శర్మ (41), స్టబ్స్(41) పరిస్థితిని ఒక్కసారిగా చక్కదిద్దారు.. అత్యంత విలువైన పరుగులు చేయడం మాత్రమే కాకుండా.. చూడ చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్నారు. వికెట్ల మీద వికెట్లు తీస్తున్న హైదరాబాద్ బౌలర్లను అడ్డుకున్నారు. వీరిద్దరూ ఏదో వికెట్ కు 66 పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. తద్వారా ఢిల్లీ జట్టు పరువును కాపాడారు.. వీరిద్దరు గనుక లేకపోయి ఉంటే ఢిల్లీ జట్టు పరిస్థితి మరింత అద్వానంగా ఉండేది. వీరిద్దరూ కాస్త నిలబడటం వల్ల ఢిల్లీ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. అంతేకాదు హైదరాబాద్ ఎదుట 134 రన్స్ టార్గెట్ విధించింది. అయితే వర్షం కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ బ్యాటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.
Also Read: గెలికిన కోహ్లీకి.. గెలిపించి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాహుల్.. వీడియో
ఐదు కంటే ఎక్కువ వికెట్ల పడినప్పటికీ..
ఐపీఎల్ లో ఐదు కంటే ఎక్కువ వికెట్ల పడినప్పటికీ.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన జట్లను ఒకసారి పరిశీలిస్తే..
2016 బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్, బెంగళూరు జట్ట మధ్య క్వాలిఫైయర్ -1 మ్యాచ్ జరిగింది.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఐదు వికెట్ల త్వరగా కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత 159/6 స్కోర్ చేసింది.
2013లో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ.. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి 144/9 స్కోర్ చేసింది.
2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 62 పరుగులకు ఆరు వికెట్లు లాస్ అయ్యింది… చివరికి 133/7 పరుగులు చేసింది.
2023లో గుజరాత్ టైటాన్స్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ లో పరస్పరం తలపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్లు త్వరగానే నష్టపోయినప్పటికీ.. ఆ తర్వాత 130/8 స్కోర్ చేసింది.
2017లో ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభంలో తీవ్రంగా తడబడింది. చివరికి 128/7 స్కోర్ చేసింది.
THE BEAST, ASHUTOSH SHARMA…!!! pic.twitter.com/ayNzi9rW7N
— Johns. (@CricCrazyJohns) May 5, 2025