https://oktelugu.com/

Rohit Sharma: న్యూజిలాండ్ జట్టుతో ఓటమి.. రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. పెర్త్ టెస్ట్ పై కీలక వ్యాఖ్యలు..

స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత్ కోల్పోయింది. చరిత్రలో తొలిసారిగా వైట్ వాష్ కు గురైంది..0-3 తేడాతో సిరీస్ నష్టపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ ఆడనుంది. అది ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 4, 2024 8:47 am
    Rohit Sharma(3)

    Rohit Sharma(3)

    Follow us on

    Rohit Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులలో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మొదలవుతుంది. నవంబర్ 22న ఈ టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ కు రోహిత్ శర్మ గైర్హాజరవుతున్నాడని.. అతడి స్థానంలో బుమ్రా కెప్టెన్సీ వహిస్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి.. అయితే న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన అనంతరం.. రోహిత్ శర్మ ను విలేకరులు పెర్త్ టెస్ట్ కు అందుబాటులో ఉంటారా? అని ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. “నేను అక్కడికి వెళ్తానో?, లేదో? తెలియదు. ఏం జరుగుతుందో చూద్దాం” అని వ్యాఖ్యానించాడు. మరోవైపు రోహిత్ పెర్త్ టెస్ట్ కు అందుబాటులో ఉండే విషయంపై మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” రోహిత్ శర్మ భార్య రితికా గర్భవతని వార్తలు వినిపిస్తున్నాయి. అతడు త్వరలో రెండవ సంతానాన్ని పొందే అవకాశం ఉంది. అందువల్లే అతడు ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్ట్ కు దూరమవుతున్నాడని” వ్యాఖ్యానించాడు.

    ఆస్ట్రేలియాతో సిరీస్ అత్యంత ముఖ్యం

    పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి వరకు భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఏకంగా ఐదు టెస్టులు ఆడుతుంది. టీం ఇండియా ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే ఆస్ట్రేలియా పై 4-0 తేడాతో టెస్ట్ సీరీస్ తప్పించుకోవాలి. ఒక మ్యాచ్ ను డ్రాగా ముగించాలి. లేనిపక్షంలో ఐదు టెస్టులను 5-0 తేడాతో గెలిస్తే భారత్ నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్తుంది.. అయితే గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంది. అయితే ఈసారి కూడా అదే మ్యాజిక్ ప్రదర్శించాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. న్యూజిలాండ్ జట్టుతో ఓటమి నేపథ్యంలో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి భారత్ పడిపోయింది. ఆస్ట్రేలియా తొలి స్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత జట్టుకు మాత్రమే కాదు ఆస్ట్రేలియా కూడా అత్యంత ముఖ్యమే. ఎందుకంటే ఈ సిరీస్లో గెలిస్తేనే ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి ప్రవేశిస్తుంది. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ట్రోఫీని దక్కించుకుంది.. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్ వెళ్లి.. టెస్ట్ గదను అందుకోవాలని భారత జట్టు భావిస్తోంది.