DC Vs RR IPL 2025: సొంతమైదానంలో బుధవారం రాత్రి రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడి.. సూపర్ ఓవర్ లో ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ లో ఇదే తొలి సూపర్ ఓవర్ మ్యాచ్. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో సూపర్ ఓవర్ మ్యాచ్ జరగడం విశేషం.. ముఖ్యంగా రాజస్థాన్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ ను ఢిల్లీ బౌలర్ స్టార్క్ అద్భుతంగా వేశాడు. 18 ఓవర్ ను సూపర్ గా వేశాడు.. హాఫ్ సెంచరీ చేసిన నితీష్ రాణాను క్రికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రాజస్థాన్ జట్టు విజయం సాధించడానికి తొమ్మిది పరుగులు అవసరమైన చోట .. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నిప్పులు చెరిగే విధంగా యార్కర్లు వేస్తూ రాజస్థాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇక చివరి ఓవర్ చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు తీయాల్సిన చోట రాజస్థాన్ ఆటగాడు ధృవ్ జూరెల్ రెండు పరుగులు మాత్రమే తీసి రాజస్థాన్ జట్టు ఓటమికి కారణమయ్యాడు.. వాస్తవానికి ఐదో బంతికి క్విక్ డబుల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ.. మరొక పరుగు తీయడానికి అతడు ఆసక్తి చూపించలేదు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి వచ్చింది. కానీ ఆ బంతికి ఒక పరుగు మాత్రమే రావడం.. రెండవ పరుగు కోసం ప్రయత్నిస్తుండగా అవుట్ కావడంతో.. ఇది మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది.. ఇక్కడే మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ అయింది.. రెండు జట్ల పరుగులు సమానం కావడంతో అంతిమంగా సూపర్ ఓవర్ దాక వెళ్లాల్సి వచ్చింది. ఇక సూపర్ ఓవర్ లోనూ స్టార్క్ అత్యంత కట్టుదిట్టంగా బంతులు వేశాడు. యార్కర్లతో రాజస్థాన్ ఆటగాళ్లను బెంబేలెత్తించాడు.. మొత్తంగా మూడు ఓవర్లలో (సూపర్ ఓవర్ కలుపుకొని) బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు స్టార్క్.
Also Read: గిల్ ఆడితే బాగుండనుకున్నా.. కానీ.. సిడ్ని టెస్ట్ పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు
నాలుగు బంతులే
సూపర్ ఓవర్ లోనూ స్టార్క్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చిన అతడు.. యశస్వి జైస్వాల్, హిట్ మేయర్ ను రన్ ఔట్ రూపంలో బలిగొన్నాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోతే.. పూర్తిస్థాయిలో ఓవర్ ఆడేందుకు అవకాశం ఉండదు. దీంతో రాజస్థాన్ జట్టు నాలుగు బంతులు మాత్రమే ఆడాల్సి వచ్చింది. ఆ నాలుగు బంతుల్లోనూ కేవలం 11 పరుగులు మాత్రమే ఆ జట్టు చేయగలిగింది. అయితే ఈ స్కోరును ఢిల్లీ జట్టు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, స్టబ్స్ నాలుగు బంతులు ఎదుర్కొని ఛేదించారు. ఫలితంగా ఓడిపోవాల్సిన స్థితిలో ఉన్న ఢిల్లీ జట్టు గెలుపును అందుకుంది. గెలవలసిన రాజస్థాన్ జట్టు ఓటమిపాలైంది. ” ధ్రువ్ జూరెల్ కనుక చివరి ఓవర్ లో చివరి బంతికి క్విక్ డబుల్ గనక తీసి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ అతడు రెండవ పరుగు ఆశించినంత వేగంతో తీయలేకపోయాడు. అది ఢిల్లీ జట్టుకు లాభం చేకూర్చింది. చివరికి సూపర్ ఓవర్ లోను రాజస్థాన్ జట్టు ఆటగాళ్లు మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. దూకుడు మీద ఉన్న జైస్వాల్, హిట్ మేయర్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఆవేశపడి రన్ అవుట్లు కావడం వల్ల రాజస్థాన్ జట్టు పుట్టి మునిగిందని” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: రోహిత్, హార్దిక్, సూర్య యాక్షన్.. రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్.. ఏంటా కథ