DC Vs RR IPL 2025: బుధవారం ఢిల్లీలోని అరుణ్ జెట్లీ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 188 పరుగులు చేసింది. రాజస్థాన్ కూడా 188 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లిపోయింది.. సూపర్ ఓవర్ లో రాజస్థాన్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి.. 11 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత ఢిల్లీ జట్టు ఈ టార్గెట్ ను కేవలం 4 బందులోనే ఫినిష్ చేసింది. తద్వారా ఈ విజయంతో ఢిల్లీ జట్టు ఐపిఎల్ పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ కు చేరుకుంది..
Also Read: రాజస్థాన్ పై ఢిల్లీ బ్యాటింగ్.. అసలు హైలెట్స్ ఇవే
నాలుగు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి
ఐపీఎల్ లో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించడం ఇదే మొదటిసారి. సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు విక్టరీ సాధించడం వెనక మిచెల్ స్టార్క్ కీ రోల్ ప్లే చేశాడు. రాజస్థాన్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో చివరి ఓవర్, సూపర్ ఓవర్ ను టెర్రిఫిక్ గా బౌలింగ్ చేశాడు. ఇల్లు జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. 5 వికెట్లు లాస్ అయ్యి 188 రన్స్ చేసింది. రాజస్థాన్ ఎదుట 189 రన్ టార్గెట్ విధించింది. ఢిల్లీ జట్టులో అభిషేక్ పోరల్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి అదరగొట్టాడు. . ఇక గత మ్యాచ్లో వీరవిహారం చేసిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రన్ అవుట్ అయ్యాడు. ఇక చివరి 5ఓవర్లలో ఢిల్లీ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి.. 77 రన్స్ స్కోర్ చేయడం విశేషం. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు సాధించాడు. తీక్షణ, హసరంగ తలా ఒక వికెట్ పడగొట్టారు.
రాజస్థాన్ విఫలం
189 రన్స్ టార్గెట్ తో రాజస్థాన్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగింది. ఓపెనర్లు సంజు శాంసన్(31 రిటైర్డ్ హర్ట్), యశస్వి జైస్వాల్ (51) అదరగొట్టారు. గాయం వల్ల సంజు శాంసన్ మధ్యలోనే మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (8) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ దశలో వచ్చిన నితీష్ రాణా(51) ఆర్థ సెంచరీ తో సత్తా చాటాడు.. ధృవ్ జూరెల్(26) చివరి వరకు క్రీజ్ లో ఉండి రాజస్థాన్ జట్టు కు విజయాన్ని అందించడానికి ప్రయత్నించాడు. చివరి ఓవర్ లో రాజస్థాన్ విజయానికి 9 రన్స్ అవసరమయ్యాయి. ఆ సమయంలో స్టార్క్ సూపర్ బౌలింగ్ వేశాడు. కేవలం 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో స్టార్క్ సూపర్ బౌలింగ్ వేయడంతో.. రాజస్థాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. సూపర్ ఓవర్ లో స్టార్క్ నిప్పులు చిమ్మే విధంగా బంతులు వేశాడు.. కేవలం ఆ ఓవర్లో 4 బంతులు మాత్రమే రాజస్థాన్ ఆడింది. 11 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు నష్టపోయింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోతే ఆ తర్వాత బంతులు ఆడే అవకాశం ఉండదు. 12 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన ఢిల్లీ కేవలం 4 బంతుల్లోనే విక్టరీ అందుకుంది.. కేఎల్ రాహుల్ (7), స్టబ్స్(6) సూపర్ ఓవర్లో అదరగొట్టారు.
Also Read: డాట్ బాల్స్ లో దుమ్ము రేపుతున్న చెన్నై బౌలర్.. ఒకే ఒక్కడిగా రికార్డు