DC Vs RCB IPL 2025: డౌటే లేదు.. టీమిండియాలో విరాట్ కోహ్లీ స్టార్ ఆటగాడు. సోషల్ మీడియాలో అతడి ప్రభంజనం మామూలుగా ఉండదు. జస్ట్ ఒక పోస్ట్ పెడితే చాలు చూస్తుండగానే లక్షల్లో వ్యూస్ పడుతుంటాయి. అందువల్లే విరాట్ కోహ్లీ తో ప్రకటనలు రూపొందించుకోవడానికి ఏజెన్సీలు వెంటపడుతుంటాయి. కంపెనీలు క్యూ కడుతుంటాయి. ఓ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ అనే వ్యక్తి సమ్మోహన శక్తి అని.. వచ్చే పదేళ్ల వరకు అతని మార్కెట్ వ్యాల్యూ ఇలాగే ఉంటుందని.. అది పైసా కూడా తగ్గదని తెలుస్తోంది. పైగా విరాట్ కోహ్లీ తో ఒప్పందం కుదుర్చుకునే కంపెనీలు మొత్తం కూడా మల్టీ నేషనల్ సంస్థలని ఆ నివేదిక వెల్లడిస్తోంది. అయితే విరాట్ కోహ్లీ అగ్రెసివ్ ఆటగాడు.. “ఇఫ్ యు ఆర్ బ్యాడ్.. ఐ యాం యువర్ డాడ్” అనే రకం. అందుకే విరాట్ కోహ్లీతో గెలుక్కోవడానికి ఎవరూ ఆసక్తి చూపించారు. కనీసం ఆదేశిక ప్రయత్నం కూడా చేయరు. పొరపాటున పనిచేశారో.. ఇక అంతే సంగతులు.. కోత మొదలైంది.. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడు అనే రేంజ్ లో విరాట్ కోహ్లీ మైదానంలో రెచ్చిపోతాడు. ఆ సమయంలో అతను చేతికి బ్యాట్ మొలిచినట్టు.. మచ్చల పులి ముఖం మీద గాండ్రించినట్టు బ్యాటింగ్ చేస్తాడు. ప్రత్యర్థి బౌలర్ కు రాత్రిపూట నిద్రను దూరం చేస్తాడు. పగటిపూట కలవరించేలా చేస్తాడు.. అయితే అటువంటి విరాట్ కోహ్లీ తోటి భారత జట్టు ఆటగాళ్లతో సఖ్యంగా ఉండడా? వారితో కూడా గొడవపడతాడా.. మన దాయాది దేశం పాకిస్తాన్ ఆటగాళ్లు అంటేనే అతనికి ఇష్టమా? ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యాప్తిలో ఉన్నాయి.
Also Read: మూడింటిలోనూ.. బెంగళూరు “లయన్ రోర్”.. ఐపీఎల్ లో ఇదో సంచలన రికార్డు!
పాక్ ఆటగాళ్లు అంటేనే ఇష్టమట..
ఇటీవల పంజాబ్ జట్టుతో మ్యాచ్ జరిగినప్పుడు శ్రేయస్ అయ్యర్ ను విరాట్ కోహ్లీ గేలి చేశాడు. ఆ తర్వాత అయ్యర్ దగ్గరికి రావడంతో విరాట్ కోహ్లీ శాంతించాడు. ఇక నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ తో విరాట్ కోహ్లీ గొడవ పడ్డట్టు కనిపించాడు. ఈ పరిణామాలు విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని నెగిటివ్ గా ప్రజలలోకి తీసుకెళ్తున్నాయి. ఆట తీరు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ.. ప్రవర్తన సరిగా లేకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. బహుశా విరాట్ కోహ్లీ కూడా అటువంటి పరిస్థితి త్వరలో ఎదుర్కొంటాడని తెలుస్తోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ ఆటగాళ్లు అంటేనే ఇష్టమని.. స్వదేశంలో ప్లేయర్లతో విరాట్ అనవసరంగా గెలుక్కుంటూ ఉంటాడని.. కొంతమంది నెటిజన్లు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. రకరకాల ప్రచారాలు చేస్తున్నారు.. స్వదేశానికి చెందిన ఓ ఆటగాడితో గొడవ పడిన దృశ్యాన్ని.. గతంలో పాకిస్తాన్ ఆటగాళ్లతో విరాట్ కోహ్లీ సరదాగా మాట్లాడిన దృశ్యాన్ని పక్క పక్కనే ఉంచి.. సొంత దేశపు ఆటగాళ్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.. అదే పాకిస్తాన్ ఆటగాళ్లతో స్నేహంగా ఉంటాడనే వ్యాఖ్యలను ఆ ఫోటోలకు జత చేశారు. దీంతో నెట్టింట విరాట్ కోహ్లీ విపరీతమైన ట్రోల్ కు గురవుతున్నాడు. అయితే ఈ పోస్ట్ చూసిన విరాట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. “ఇలాంటి ఫోటోలు పెట్టి శునకానందం మాత్రమే పొందగలరు.. మీరు మాకు దొరికితే ఉంటది రా.. విరాట్ కోహ్లీ కాదు.. మా చేతిలోనే బడిత పూజ సాగుతుందని” సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. కాదు కాదు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి మరి.
Virat Kohli;
With Indians With Pakistani pic.twitter.com/9pQn32qXmd
— Dhonism™️ ( Fan Account ) (@Dhonismforlife) April 27, 2025
Also Read: ఢిల్లీ పై బెంగళూరు గెలిచినా.. విరాట్ కోహ్లీని ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకిలా?