David Warner: డేవిడ్ వార్నర్.. మామూలోడు కాదు.. అతడు చేసిన పనికి అంతా అవాక్కు

స్వదేశంలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్టుతో మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడింది. తొలి రెండు మ్యాచ్ లను ఆస్ట్రేలియా గెలుచుకుంది. చివరి మ్యాచ్ మాత్రం వెస్టిండీస్ దక్కించుకుంది.

Written By: Suresh, Updated On : February 14, 2024 7:36 pm
Follow us on

David Warner: మైదానంలో ఆడే ప్రతి ఆటగాడికి అభిమానులు ఉంటారు. కొంతమంది ఆటగాళ్లు మాత్రమే అభిమానుల మనసులు గెలుచుకుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. దూకుడైన ఆటతీరుతో ఇప్పటివరకు ఎన్నో మ్యాచులు ఆస్ట్రేలియా గెలిచే విధంగా చేశాడు. అసాధారణమైన ఆటతీరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లు పొందాడు. మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ డేవిడ్ వార్నర్ యాక్టివ్ గా ఉంటాడు. ఇండియన్ సినిమాల పాటలకు సరదాగా స్టెప్పులు వేస్తూ అలరిస్తాడు. పుష్ప సినిమాలో చూపే బంగారమాయనే శ్రీవల్లి అనే పాటకు డ్యాన్స్ వేసి అందరిని ఆకట్టుకున్నాడు. అలాంటి డేవిడ్ వార్నర్ చేసిన ఓ పని ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నది.

స్వదేశంలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్టుతో మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడింది. తొలి రెండు మ్యాచ్ లను ఆస్ట్రేలియా గెలుచుకుంది. చివరి మ్యాచ్ మాత్రం వెస్టిండీస్ దక్కించుకుంది. చివరి t20 మ్యాచ్ పెర్త్ వేదికగా జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 220 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన ఆస్ట్రేలియా కేవలం 183 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్ తగ్గించుకుంది. ఆస్ట్రేలియా ఈ సిరీస్ గెలవడంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఇతడు మూడు మ్యాచ్లలో రెండు అర్థ సెంచరీలు సాధించాడు. మొత్తంగా 173 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 166 కంటే ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో అతడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కు ఎంపికయ్యాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం నిర్వాహకులు అందరికీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీ అందించారు. ఆ ట్రోఫీని అందుకున్న డేవిడ్ వార్నర్ స్టేడియం లో కూర్చున్న చిన్నారికి అందించాడు. అకస్మాత్తుగా డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాడు తనకు ట్రోఫీ ఇవ్వడంతో ఆ చిన్నారి ఎంతో సంతోషించింది. ఇప్పుడు మాత్రమే కాదు డేవిడ్ వార్నర్ గతంలో కూడా తనకు వచ్చిన ట్రోఫీలను ఇలాగే ప్రేక్షకులకు అందించాడు. తను వాడే గ్లోవ్స్ కూడా ప్రేక్షకులకు కానుకగా అందించాడు. ఇక డేవిడ్ వార్నర్ ట్రోఫీని ఓ చిన్నారికి బహుమతిగా ఇవ్వడంతో సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు అతడిని కొనియాడుతున్నారు. ఇక డేవిడ్ వార్నర్ గత నెలలో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్ తర్వాత ఆ ఫార్మాట్ కూడా అతడు గుడ్ బై చెప్పనున్నాడు. ఇక స్వదేశంలో వార్నర్ కు ఇదే చివరి టి20 మ్యాచ్ అని తెలుస్తోంది.