CSK vs Delhi match preview: చెన్నై జట్టు ప్రయాణం ఈ ఐపీఎల్లో అంత గొప్పగా సాగడం లేదు. గెలిచే మ్యాచ్లో ఓడిపోతూ ఆ జట్టు పరువు తీసుకుంటున్నది. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆ జట్టు.. ఇలా ఆడటంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై జట్టులో బ్రేవిస్, ధోని లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
బ్రేవిస్ ఏప్రిల్ 11న ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని చెన్నై మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో అభిమానుల్లో కాస్త ఆనందం నెలకొంది. ఎందుకంటే బ్రేవిస్ దూకుడుగా ఆడతాడు. విధ్వంసాన్ని సృష్టించి వెళ్తాడు. అతడు జట్టులోకి వస్తే పరుగుల వరద ప్రవహిస్తుందని చెన్నై మేనేజ్మెంట్ భావిస్తోంది.
బ్రేవిస్ ఎంట్రీ పరంగా గుడ్ న్యూస్ లభించినప్పటికీ.. ఇప్పటికీ ధోని గురించి అభిమానులలో ఆందోళన కనిపిస్తూనే ఉంది. ధోని ఆడతాడా? లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అయితే ధోని ఇప్పటికి ఫిట్ కాలేదని వార్తలు వస్తున్నాయి. అతడి ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని సమాచారం. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత చెన్నై ప్లేయర్ల శిక్షణ శిబిరానికి ధోని హాజరయ్యాడు. దీంతో తదుపరి మ్యాచ్ కి అతడు అందుబాటులో ఉంటాడని అందరూ అనుకున్నారు.
కేవలం శిక్షణ శిబిరానికి మాత్రమే అతడు హాజరయ్యాడు. ఆటగాళ్లతో కలిసి మాట్లాడాడు. అంతకుమించి అతడు ఏమి చేయలేదు. ఎందుకంటే అతడి ఆరోగ్యం మెరుగ్గా లేదు. ఇప్పుడు ఇక ధోని ఏప్రిల్ 11న ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని అనుకున్నారు. కానీ అది అంత ఈజీ కాదట. ఇంకా మూడు నాలుగు మ్యాచ్ ల వరకు అతడు జట్టుకు దూరంగానే ఉండే అవకాశం ఉంది. ఆ తదుపరి సామర్ధ్య పరీక్షలో అతడు నెగ్గితే అప్పుడు జట్టులో ప్రవేశిస్తాడని వార్తలు వస్తున్నాయి.
ధోని లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్లే చెన్నై జట్టు వరుసగా ఓటములను ఎదుర్కొంటున్నది. ఈ ఓటములను చెన్నై అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సొంత మైదానంలో కూడా ప్రత్యర్థి జట్లకు పోటీ ఇవ్వలేక చెన్నై జట్టు చేతులెత్తయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే ధోని రావాలని బలంగా కోరుకుంటున్నారు.