Homeక్రీడలుక్రికెట్‌CSK vs RCB fan war: RCB గెలిచింది.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ వీడియో

CSK vs RCB fan war: RCB గెలిచింది.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ వీడియో

CSK vs RCB fan war: ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. 2008లో ఐపీఎల్ మొదలైతే.. 2024 వరకు బెంగళూరు జట్టు చాలాసార్లు ఫైనల్ దాకా వచ్చింది. ఫైనల్ లో ట్రోఫీ గెలవలేకపోయింది. 2025 సీజన్లో మాత్రం తన రాతను బెంగళూరు జట్టు పూర్తిగా మార్చుకుంది. ఫైనల్ శ్రేయస్ అయ్యర్ జట్టు మీద గెలిచి తొలిసారి ట్రోఫీ అందుకుంది. ఆ తర్వాత బెంగళూరు జట్టు స్థాయి ఒకసారిగా మారిపోయింది. జట్టు విలువ ఆకాశాన్ని తాకింది.

బెంగళూరు జట్టు 2024 వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినప్పటికీ.. అభిమానులు ఆ జట్టుకు అండగా ఉండుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ జట్టు అధికారిక ఖాతాను అనుసరిస్తున్న అభిమానులు దీనికి బలమైన నిదర్శనం.. బెంగళూరు జట్టుకు వయసుతో తారతమ్యం లేకుండా అభిమానులు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇక మైదానంలో మ్యాచ్ జరుగుతుంటే ఎర్రజెండాలతో నింపేస్తుంటారు. మైదానాన్ని ఎర్ర సముద్రంగా మార్చేస్తుంటారు. గుజరాత్ జట్టుతో తాజా సీజన్లో జరిగిన ప్లే ఆఫ్.. ఫైనల్.. అంతకు ముందు లీగ్.. ఇలా అన్ని మ్యాచ్ల్లో బెంగళూరు ఫ్యాన్స్ తమ జట్టు మీద అభిమానాన్ని చూపించారు. చివరికి అహ్మదాబాద్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరిగినప్పటికీ.. అభిమానంలో గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ కంటే అప్పర్ హ్యాండ్ లో నిలిచారు.

బెంగళూరు అభిమానులు తమ జట్టుకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. తమ జట్టు గురించి ఎవరైనా చెత్తగా మాట్లాడితే చిత్తుచిత్తు చేస్తారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు గురించి కొంతమంది చెడుగా మాట్లాడితే అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు నగరంలో ఓ పబ్ వద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అక్కడ అభిమానుల మధ్య చర్చ జరిగింది. బెంగళూరు జట్టు గురించి కొంతమంది వ్యక్తులు తప్పుగా మాట్లాడితే.. ఆర్ సి బి అభిమానులు తట్టుకోలేకపోయారు. వెంటనే వారి మీద దాడి చేశారు. పొట్టు పొట్టు కొట్టారు.

“ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆర్సిబి ఫ్యాన్స్ అంటే ఏమిటో అందరికీ మరొకసారి తెలిసిపోయింది. ఐపీఎల్ లో అన్ని జట్లకు అభిమానులు ఉంటారు. బెంగళూరు జట్టుకు మాత్రమే భక్తులు ఉంటారు. ఇది తాజా ఘటనతో నిరూపితమైంది. మామూలుగానే బెంగళూరు అభిమానులు ఒక స్వింగ్లో ఉంటారు. వారు తమ సత్తాను ఇప్పుడు చూపించారు. వరుసగా రెండుసార్లు ట్రోఫీలు గెలిచి బెంగళూరు జట్టు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఐపీఎల్ మొత్తాన్ని బెంగళూరు శాసిస్తుందని” సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version