‘మహేంద్రుడి’పై విమర్శల వెల్లువ..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు పలికాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. చైన్నె సూపర్ కింగ్స్ ధోని నాయకత్వం వహిస్తున్నాడు. రాజస్థాన్-చైన్నె సూపర్ కింగ్స్ మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ లో ధోని ఏడో నెంబర్లో బ్యాటింగ్ రావడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. Also Read: రికార్డుకు బ్రేక్..కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బ ముందుగా బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టు చైన్నె సూపర్ కింగ్స్ కు 217పరుగుల […]

Written By: NARESH, Updated On : September 24, 2020 3:38 pm
Follow us on

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు పలికాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. చైన్నె సూపర్ కింగ్స్ ధోని నాయకత్వం వహిస్తున్నాడు. రాజస్థాన్-చైన్నె సూపర్ కింగ్స్ మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ లో ధోని ఏడో నెంబర్లో బ్యాటింగ్ రావడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.

Also Read: రికార్డుకు బ్రేక్..కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బ

ముందుగా బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టు చైన్నె సూపర్ కింగ్స్ కు 217పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. రన్ రేట్ పెరిగిపోతున్న సమయంలోనూ ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాకపోవడం.. యువ ఆటగాడు రుతురాజ్ ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడాన్ని మాజీలు తప్పుబడుతున్నారు. 38బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన సమయంలో ధోని బ్యాటింగ్ రావడాన్ని తప్పుబట్టారు.

ధోని ఎంట్రీ ఇచ్చే సమయానికి మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిందని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జట్టు ముందుండి గెలిపించాల్సిన ధోని చివర్లో రావడం నాయకత్వం లక్షణం కాదని మాజీ క్రికెటర్లు గంభీర్, గవాస్కర్లు విమర్శించారు. ధోని చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడని.. అయితే అతడు 4 లేదా 5వ స్థానంలో వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read: ఆమ్యాచ్ ను 20 కోట్ల మంది చూశారు…

చెన్నె సూపర్ కింగ్స్ మ్యాచ్ లో డిప్లెసి ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడని.. ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చి డిప్లెసితో ఇన్నింగ్స్ నిర్మిస్తే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలని సూచిస్తున్నారు. ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మాజీలు చెప్పినమాటను ధోని వింటాడో లేదో వేచిచూడాల్సిందే..!