Gautam Gambhir: సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టులు ఆడింది. రెండు కూడా గెలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడింది. రోహిత్ నుంచి మొదలు పెడితే విరాట్ వరకు జట్టులో ఉన్నారు. అయినప్పటికీ మూడు మ్యాచ్లను టీమిండియా ఓడిపోయింది. తొలిసారిగా స్వదేశంలో వైట్ వాష్ కు గురైంది. అప్పట్లోనే ఆటగాళ్ల తీరుపై.. గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో జట్టు ఆటగాళ్లు మొత్తం కచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని నిబంధన తీసుకొచ్చాడు గౌతం.
అతడు తీసుకొచ్చిన నిబంధన ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయింది. ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 2-2 తో ఈక్వల్ చేసింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండు టెస్టులలో గెలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను కోల్పోయింది. టీమ్ ఇండియాలో ఉన్న ప్లేయర్లతో పోల్చి చూస్తే దక్షిణాఫ్రికా ప్లేయర్లు అంత గొప్ప వాళ్ళు కాదు. అయినప్పటికీ టీమిండియా పిచ్ ల మీద అటు బ్యాటింగ్, బౌలింగ్లో అదర కొట్టారు. ఫీల్డింగ్ లో అయితే సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. తద్వారా టీమిండియా కు చరిత్రలో ఊహించని విధమైన ఓటములను పరిచయం చేశారు. స్వదేశంలో సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కల్పించారు. ఏ ఒక్క ఆటగాడు సరిగ్గా ఆడ లేకపోవడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు వీరవిహారం చేశారు. మన బౌలర్లు వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్న వేళ.. వారు మాత్రం గింగిరాలు తిరిగే విధంగా బంతులు వేసి నరకం చూపించారు.
టీమిండియా ఫెయిల్యూర్ కావడంతో మాజీ క్రికెటర్లు విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ముందు వరసలో ఉన్నాడు. అతడు విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది..”ఏడాది వ్యవధిలో రెండు వైట్ వాష్ లు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అద్భుతమైన ప్లేయర్లు ఉన్న జట్టు స్వదేశంలో ఇలా ఎలా ఆడుతుంది? అసలు ఏం జరుగుతోంది? న్యూజిలాండ్ జట్టు 3 -0 తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టు 2-0 తేడాతో గెలిచింది. అలాంటప్పుడు ఇంతమంది ప్లేయర్లు ఉండి ఏం లాభం? అసలు వీరిని జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారు? మేనేజ్మెంట్ ఏం చేస్తోంది? కోచ్ ఏం చేస్తున్నారు? అసలు ఇటువంటి సరైనవేనా? హాస్యాస్పదంగా అనిపించడంలేదా? సిగ్గుతో కూడిన ఇబ్బంది అనిపించడం లేదా? ఇలాంటప్పుడే ప్రక్షాళన అవసరం. లేనిపక్షంలో టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా ఇంకా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని” దినేష్ కార్తీక్ సున్నితంగా హెచ్చరించాడు. దినేష్ కార్తీక్ సంధించిన ప్రశ్నలతో చాలామంది క్రికెటర్లు ఏకీభవించారు. అభిమానులు కూడా అతడు అడిగిన విధానం సరైనదని కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? గౌతమ్ గంభీర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు? ఇప్పుడు ఈ ప్రశ్నలకే సమాధానం లభించాల్సి ఉంది.