Homeక్రీడలుక్రికెట్‌Usman Tariq: బంతిని గల్లీ క్రికెట్ లో మాదిరిగా విసురుతున్నాడు..ఈ దిక్కు మాలిన సంత ఆ...

Usman Tariq: బంతిని గల్లీ క్రికెట్ లో మాదిరిగా విసురుతున్నాడు..ఈ దిక్కు మాలిన సంత ఆ పాకీ సంతతే!

Usman Tariq: గల్లి క్రికెట్ లో బంతిని ఎలాగైనా సరే విసరవచ్చు. అక్కడ నిబంధనలు ఉండవు. కేవలం క్రికెట్ ఆడుతున్న సంతృప్తి మాత్రమే ఉంటుంది. అదే జాతీయస్థాయిలో.. అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్ చేస్తుంటే ప్రమాణాలు పాటించాలి. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా బంతిని వేస్తూ ఉండాలి.

బంతిని వేసే క్రమంలో బౌలర్ ఏమైనా పొరపాట్లు చేస్తే ఐసీసీ ఎదుట హాజరు కావాలి. ఐసీసీ నిర్వహించే పరీక్షలో బౌలర్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. గతంలో అనేకమంది బౌలర్లు వివాదాస్పద బౌలింగ్ వేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో విజయవంతమయ్యారు. ఇందులో కొంతమంది విఫలం కావడంతో కెరియర్ కు ముగింపు పలికారు.

ప్రస్తుత క్రికెట్లో అత్యంత వివాదాస్పదమైన బౌలర్ గా పాకిస్తాన్ ప్లేయర్ ఉస్మాన్ తారిక్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడు బౌలింగ్ వేస్తున్న విధానం అత్యంత దారుణంగా ఉంది. చేతిని ఏమాత్రం తిప్పడం లేదు. పైగా బంతిని ఏదో గురి చూసినట్టు విసురుతున్నాడు. దీంతో బ్యాటర్లకు పరుగులు తీయడం కష్టంగా మారుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ లో పర్యటించింది. టి20 సిరీస్లో వైట్ వాష్ కు గురైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ పాకిస్తాన్ బౌలర్ బౌలింగ్ పై ఫిర్యాదు చేశాడు. ఇలా బౌలింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు.

ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది. అతడు వేస్తున్న బౌలింగ్ ఏ మాత్రం సక్రమంగా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీమిండియా అభిమానులైతే ఒక అడుగు ముందుకేసి.. ఎక్కడ దొరికిన సంత ఇది.. ఇలాంటి దిక్కుమాలిన వాళ్లంతా పాకిస్తాన్లోనే ఉంటారని టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇది బౌలింగా.. ఇదే బౌలింగా.. బంతులు ఇలా కూడా వేస్తారా.. ఇలా వేస్తే దాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ అని చెప్పాలా.. అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ ఆణిముత్యాన్ని ఎక్కడ పట్టుకొచ్చారు నాయనా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular