https://oktelugu.com/

Mohammed Shami: రాజకీయాల్లోకి ఇండియన్ బౌలర్.. టికెట్ కేటాయించిన బిజెపి

ఇండియన్ క్రికెటర్, స్పీడ్ బౌలర్ మహమ్మద్ షమీ తన రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో పోటీ చేస్తానని సంకేతాలు ఇస్తున్నాడు. అతడికి భారతీయ జనతా పార్టీ టికెట్ దాదాపుగా ఓకే చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 10, 2024 / 02:42 PM IST

    Mohammed Shami

    Follow us on

    Mohammed Shami: వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆ బౌలర్.. ఇటీవల ఇంగ్లాండులో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సాధారణంగా అటువంటి ట్వీట్లు ఎక్కువగా చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఒక్కసారిగా స్పందించడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ దాని వెనుక ఏమున్నది అనే విషయాన్ని పసిగట్ట లేకపోయారు. పసిగట్ట లేకపోయినంత మాత్రాన నిజం దాగదు కదా.. ఎట్టకేలకు నిజం తెలిసిపోయింది.

    ఇండియన్ క్రికెటర్, స్పీడ్ బౌలర్ మహమ్మద్ షమీ తన రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో పోటీ చేస్తానని సంకేతాలు ఇస్తున్నాడు. అతడికి భారతీయ జనతా పార్టీ టికెట్ దాదాపుగా ఓకే చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కుడికాలు చీలా మండ గాయానికి అతడు ఇంగ్లాండ్ లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. త్వరలో టి20 వరల్డ్ కప్ లో ఆడాల్సి ఉండటంతో విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న షమీని బిజెపి నాయకులు ఇటీవల సంప్రదించినట్టు తెలుస్తోంది.

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బషీర్ హత్ నియోజకవర్గంలో షమీ ని బరిలోకి దింపాలని బిజెపి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు అధికంగా ఉంటారు. వారిని ఆకర్షించాలంటే షమీ ని రంగంలోకి దింపడం ఒకటే మార్గమని బిజెపి భావిస్తోంది. అందువల్లే బిజెపి పెద్దలు ఇటీవల షమీతో సంప్రదింపులు జరిగినట్టు వార్తలు వినిపించాయి. ఇక ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖాళీ ప్రాంతంలో చెలరేగిన హింస గురించి తెలిసిందే. ఆ ప్రాంతం కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అయితే బిజెపి నాయకులు షమీ ని సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ, తన రాజకీయ ప్రవేశం గురించి ఇంతవరకు అతను ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని షమీ సన్నిహితులు అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత షమీ గాయం కారణంగా చాలా టోర్నీలకు దూరమయ్యాడు. ఐపీఎల్ లో కూడా అతడు ఆడేది అనుమానంగానే ఉంది.