Bhuvneshwar Kumar: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ చేసిన ఈ పని కి సెల్యూట్ చేస్తారు

టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఒక గురుకులంలో ఉంటున్న నిరుపేద విద్యార్థుల చదువు కోసం పది లక్షల రూపాయలు విరాళంగా అందించాడు.

Written By: BS, Updated On : July 2, 2023 5:15 pm

Bhuvneshwar Kumar

Follow us on

Bhuvneshwar Kumar: భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన బౌలింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు భువనేశ్వర్ కుమార్. భారత జట్టుకు అనేక మ్యాచుల్లో అపూర్వ విజయాలను అందించి పెట్టాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతూ కీలక బౌలర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే, భువనేశ్వర్ కుమార్ తాజాగా చేసిన ఒక పని క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకునేలా చేస్తోంది.

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నిరుపేద చిన్నారులకు ఆర్థిక సాయం అందించాడు. భువనేశ్వర్ కుమార్ చేసిన ఈ పనిని క్రికెట్ అభిమానులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో క్రికెటర్లు సామాజిక కార్యక్రమాలను చేస్తున్నారు. అదే కోవలోకి వచ్చారు స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఓ గురుకులంలో చదువుతున్న చిన్నారుల చదువు కోసం పది లక్షల రూపాయలు విరాళాన్ని భువనేశ్వర్ కుమార్ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.

చిన్నారుల చదువు కోసం గురుకులానికి విరాళం..

టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఒక గురుకులంలో ఉంటున్న నిరుపేద విద్యార్థుల చదువు కోసం పది లక్షల రూపాయలు విరాళంగా అందించాడు. ఈ గురుకులంలో ఉండే చిన్నారులంతా ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో మీ మొత్తాన్ని భువనేశ్వర్ కుమార్ అందించాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భువనేశ్వర్ కుమార్ ఈ విధంగా ఆర్థిక సహాయం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో ఈ విధంగా ఆర్థిక సహాయాన్ని చేశాడు. 2013 లో ఉత్తరాఖండ్ లో పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తినప్పుడు తనవంతు సహాయం చేశాడు. ఇటీవల తన ఆట తీరు కాస్త పేలవంగా కొనసాగిస్తున్నప్పటికీ.. ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఆర్థిక సహాయం చేశాడన్న విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. ఆటతోనే కాకుండా.. మానవత దృక్పథంతోనూ అభిమానుల మనసును భువనేశ్వర్ కుమార్ గెలుచుకున్నాడు అంటూ పలువురు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు 21 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా 63 వికెట్లు తీశాడు. అలాగే 121 వన్డే మ్యాచ్ లు ఆడగా 141 వికెట్లు పడగొట్టాడు. అలాగే 87 టి20 మ్యాచ్ లో 90 వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్.