WPL 2026 full squads: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ప్లేయర్ల వేలం పూర్తయింది. మొత్తం 67 మంది ప్లేయర్లను ఆయా జట్ల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. ఇందులో 23 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అన్ని జట్లు కలిపి 40.8 కోట్లు ఖర్చు చేశాయి.. దీప్తి శర్మ హైయెస్ట్ ధర దక్కించుకున్నారు. 3.20 కోట్లతో యూపీ యాజమాన్యం ఆమెను కొనుగోలు చేసింది. దీనికోసం ఆర్టీఎం కార్డు ఉపయోగించింది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అమేలియా ను ముంబై చెట్టు యాజమాన్యం మూడు కోట్లకు కొనుగోలు చేసింది.. ఇక మన దేశానికి చెందిన ఆల్రౌండర్ షికా పాండేను యూపీ జట్టు 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ జట్టులో సీనియర్ ప్లేయర్ సోఫీ ఎకిల్ స్టోన్ ను గుజరాత్ యాజమాన్యం రెండు కోట్లకు దక్కించుకుంది.
జట్ల బలాలు ఎలా ఉన్నాయంటే
బెంగళూరు: జార్జియా 60 లక్షలు, నాడిన్ 65 లక్షలు, రాధా 65 లక్షలు, లారెన్ 90 లక్షలు, లింసే 30 లక్షలు, ప్రేమరావత్ 20 లక్షలు ఆర్టిఎం, అరుంధతి రెడ్డి 75 లక్షలు, పూజ 85 లక్షలు, గ్రేస్ 75 లక్షలు, గౌతమి 10 లక్షలు, ప్రత్యూష 10 లక్షలు, హేమలత 30 లక్షలు
ముంబై: అమేలియా మూడు కోట్లు, శబ్నమ్ ఇస్మాయిల్ 60 లక్షలు, సంస్కృతి 20 లక్షలు, సజీవన్ సజన 75 లక్షలు, రహీల 10 లక్షలు, నికోల 30 లక్షలు, త్రివేణి 20 లక్షలు, నల్లారెడ్డి పది లక్షలు, సైక ఇషాక్ 30 లక్షలు, మిలి 10 లక్షలు. ఈ జట్టు యాజమాన్యం అమన్, హర్మన్ ప్రీత్, హెలి మ్యాథ్యూస్, నాట్ సివర్, కమలీని ని రిటైన్ చేసుకుంది.
ఢిల్లీ: లారా 1.10 కోట్లు, చినెల్లె 1.30 కోట్లు, శ్రీ చరణి 1.30 కోట్లు, స్నేహ రానా 50 లక్షలు, లిజల్ 30 లక్షలు, దియా 10 లక్షలు, తనియ 30 లక్షలు, మమత 10 లక్షలు, నందిని 10 లక్షలు, హామిల్టన్ పది లక్షలు, మిన్ను మని 40 లక్షలు.
ఈ జట్టు యాజమాన్యం జమీమా, శఫలివర్మ, మారిజన్ కాప్, అన్నా బిల్ సదర్ ల్యాండ్ , నిక్కీ ప్రసాద్ ను రిటైన్ చేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ వారియర్స్: దీప్తి శర్మ 3.2 కోట్లు ఆర్టిఎం, సోఫీ 85 లక్షలు, మెగ్ లార్నింగ్ 1.90 కోట్లు, పోబ్ 1.20 కోట్లు, కిరణ్ 60 లక్షలు, 50 లక్షలు, క్రాంతి గౌడ్ 50 లక్షలు, ఆశా శోభన 1.10 కోట్లు, డాట్ ఇన్ 80 లక్షలు, శిఖా పాండే 2.40 కోట్లు, సిమ్రాన్ 10 లక్షలు, సిప్రా గిరి 10 లక్షలు, ట్రయాన్ 30 లక్షలు, సుమన్ మీనా 10 లక్షలు, గొంగిడి త్రిష 10 లక్షలు, ప్రతీక 40 లక్షలు, తార నూరి స్ 10 లక్షలు. ఈ జట్టు యాజమాన్యం శ్వేతను రిటైన్ చేసుకుంది.
గుజరాత్: శివాని 10 లక్షలు, రాజేశ్వరి 40 లక్షలు, దాని 50 లక్షలు, ఆయుష్ సోనీ 30 లక్షలు, యాస్తిక 50 లక్షలు, హ్యాపీ కుమారి 10 లక్షలు, కిమ్ గార్డ్ 50 లక్షలు, తనుజ కన్వర్ 45 లక్షలు, జార్జియా కోటి, అనుష్క శర్మ 45 లక్షలు, కాశ్మీర్ గౌతమ్ 75 లక్షలు ఆర్టీఎం, కనిక అహుజా 30 లక్షలు, టిటాస్ సాదు 30 లక్షలు, రేణుక సింగ్ 50 లక్షలు, భారతి 70 లక్షలు.. అశ్లీగ్ గార్డ్ నర్ , బెత్ మూనీ ఈ జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకుంది.