MS Dhoni: ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై.. సీఎస్కే ట్విట్ వెనుక ఉద్దేశం అదేనా?

ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంత మైదానంలో చివరి మ్యాచ్ ఆడుతోంది. చెపాక్ వేదికగా రాజస్థాన్ జట్టుతో పోటీపడుతోంది. టాస్ రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 12, 2024 6:31 pm

MS Dhoni

Follow us on

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా మలిచి.. అత్యంత విజయవంతమైన జట్టుగా ఆవిర్భవించేలా చేసిన ఘనత మహేంద్ర సింగ్ ధోని సొంతం. ప్రస్తుతం ధోని నాలుగు పదుల వయసులో ఉన్నాడు. అయితే ఈ టీమిండియా మాజీ దిగ్గజం ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విట్టర్ ఎక్స్ లో ఒక ట్వీట్ చేసింది. దీంతో రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంత మైదానంలో చివరి మ్యాచ్ ఆడుతోంది. చెపాక్ వేదికగా రాజస్థాన్ జట్టుతో పోటీపడుతోంది. టాస్ రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. అయితే చెన్నై జట్టు మైదానంలోకి దిగకముందు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో చేసిన ఒక ట్వీట్ చర్చకు దారి తీస్తోంది. “రాజస్థాన్ జట్టుతో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు మొత్తం ఎదురు చూడాలి. సూపర్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని” విన్నవించింది. అయితే ఈ ట్వీట్ రకరకాల ఊహాగానాలకు కూతమిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ట్వీట్ చేయడంతో.. ఆ జట్టులో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ గుడ్ బై చెబుతాడా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే తాను చెపాక్ మైదానం వేదికగా చివరి మ్యాచ్ ఆడతానని ఇప్పటికే ధోని చెప్పాడు. దీంతో సీఎస్కే జట్టు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడు కాబట్టే ఈ ట్వీట్ చేసిందని తెలుస్తోంది.

ఈ మ్యాచ్ కు ధోని భార్య సాక్షి సింగ్, సురేష్ రైనా, ప్రముఖులు హాజరయ్యారు. అయితే అభిమానులు చాలామంది ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని భావిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, స్థానిక అభిమానులకు ప్రత్యేక బహుమతులు అందించేందుకు సీఎస్కే ఈ ట్వీట్ చేసిందని తమిళ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఐపీఎల్ సీజన్లో సొంతం మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత.. చెన్నై ఆటగాళ్లు గ్రౌండ్ చుట్టూ తిరుగుతారు. అభిమానులకు అభివాదం చేస్తారు. తమకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ కు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అంతేకాదు టెన్నిస్ బాల్స్, బ్యాట్లు, టీ షర్టులు అందజేస్తారు. ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించేందుకు సీఎస్కే ఈ ట్వీట్ చేసిందని తెలుస్తోంది.