Virat Kohli stunning catch: ప్రస్తుత క్రికెట్లో అత్యంత వేగవంతంగా ఫీల్డింగ్ చేసే ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. బంతిని ప్రత్యర్థి బ్యాటర్ కొట్టడమే ఆలస్యం.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతుంటాడు. లిప్తపాటు కాలంలోనే బంతిని ఆపేస్తుంటాడు. క్యాచ్ పట్టే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడు. పైగా తనను తాను నియంత్రించుకుంటూ బంతిని అందుకునే విధానంలో సరికొత్త చరిత్రను సృష్టించాడు విరాట్ కోహ్లీ.. అందువల్లే విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమాన గణం ఉంటుంది.
చాలా రోజుల తర్వాత మైదానంలోకి విరాట్ కోహ్లీ అడుగు పెట్టాడు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ ద్వారా అతడు మైదానంలో సందడి చేస్తున్నాడు. తొలి రెండు వన్డే లలో టీమిండియా ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ కూడా ఆశించిన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పెర్త్, అడిలైడ్ వన్డేలలో అతడు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రాక్టీస్ లేకుండా విరాట్ కోహ్లీని ఎందుకు జట్టులోకి తీసుకున్నారని విమర్శించారు. కానీ అతడు మాత్రం ఆ విమర్శలను జస్ట్ లైట్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ మూడో వన్డేలో అదరగొట్టాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఫీల్డింగ్ లో చిరుత వేగాన్ని ప్రదర్శించాడు. అతడు అందుకున్న క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. మిడాఫ్ లో ఉన్న విరాట్ కోహ్లీ చూస్తుండగానే సూపర్ క్యాచ్ పట్టి అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ చేసిన ఫీల్డింగ్ ను చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. విరాట్ విరాట్ అంటూ నినాదాలు చేశారు.
హర్షిత్ బౌలింగ్లో ఆస్ట్రేలియా ఆటగాడు షార్ట్ బలంగా కొట్టాడు. దీంతో దూసుకు వస్తున్న బంతిని అమాంతం చేతుల్లోకి తీసుకొని.. షార్ట్ కు షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. సెకండ్ల వ్యవధిలోనే బంతిని అందుకొని స్టేడియంలో మోత మోగించాడు. విరాట్ కోహ్లీ దూకుడు వల్ల షార్ట్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. ఫీల్డింగ్ విషయంలో విరాట్ కోహ్లీకి వంక పెట్టవలసిన అవసరం లేదు. పై అతడు మైదానంలో పాదరసం మాదిరిగా కదులుతుంటాడు. దూకుడుగా బ్యాటింగ్ చేయడం మాత్రమే కాదు.. వేగంగా బంతులను కూడా నిలువరించగలడు. అందువల్లే అతడు ఈ కాలపు టీమిండియా అడ్డు గోడ అని పిలుస్తుంటారు.
Reflexes at peaks pic.twitter.com/hZZ4r08f5e
— KOHLIFIED REBEL (@Kingtweeets) October 25, 2025