Virat Kohli Marriage Rumour: విరాట్ కోహ్లీ అద్భుతమైన క్రికెటర్. మైదానంలో విపరీతమైన ఆవేశంతో ఉంటాడు. అదే సమయంలో అద్భుతమైన కామెడీని పండిస్తుంటాడు. తోటి ప్లేయర్లను ఆటపట్టిస్తుంటాడు. అటువంటి వ్యక్తిత్వమే అతడిని హీరోను చేసింది.
మైదానంలో విరాట్ కోహ్లీ ఆవేశంతో ఉంటాడు. అదే సమయంలో వ్యూహ చతురత కూడా ప్రదర్శిస్తుంటాడు. అందువల్లే అతడికి విపరీతంగా అభిమానులు ఉంటారు. క్రికెట్ చూసే వాళ్ళు మాత్రమే కాకుండా.. క్రికెట్ ఆడే వాళ్ళు కూడా అతనికి అభిమానులుగా ఉంటారు. అందులో ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ఒకడు. మార్కెట్ టేలర్ కంగారు జట్టుకు ఒకప్పుడు సారధిగా ఉన్నాడు. నాయకుడిగా ఎన్నో విజయాలు తన జట్టుకు అందించాడు. క్రికెట్ నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఆయన స్పోర్ట్స్ చానల్స్ కు ఇంటర్యూలు నిర్వహిస్తున్నారు. విరాట్ కోహ్లీ భారత జట్టుకు సారథి అయిన తొలి రోజుల్లో మార్క్ టేలర్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితానికి సంబంధించి.. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక ప్రశ్నలు అడిగాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఏమాత్రం తడవకుండా ఓపెన్ గానే అన్ని విషయాలు చెప్పేశాడు. అప్పట్లో ఆ ఇంటర్వ్యూ ఒక సంచలనంగా మారింది. వాస్తవానికి భారత జట్టుకు సారథిగా ఎంపికైన తర్వాత విరాట్ కోహ్లీ కొన్ని ఎంపిక చేసిన పత్రికలు, చానల్స్ కు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో టేలర్ ఒకడు.
Also Read: Virat Kohli : లక్నో పై గెలిచిన తర్వాత.. విరాట్ చేసిన పనికి అనుష్క ముసి ముసి నవ్వులు
కూతుర్ని చేసుకోమని అడిగాడు
విరాట్ కోహ్లీ ని ఇంటర్వ్యూ చేసే క్రమంలో.. టేలర్ కు ఇచ్చిన సమయం పూర్తయింది. కానీ విరాట్ కోహ్లీ అదనపు సమయం కూడా ఆ ఇంటర్వ్యూ కోసం కేటాయించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా టేలర్ ప్రతి ప్రశ్నకు విరాట్ కోహ్లీ సమాధానం చెప్పాడు. విరాట్ కోహ్లీ మైదానంలో ఆవేశంగా చూసిన టేలర్.. ఒక్కసారి అతనిపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. తర్వాత అతడిని మరింతగా అభిమానించడం మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లీ సారధి అయిన తొలి రోజుల్లో.. టేలర్ కు 17 సంవత్సరాల కుమార్తె ఉండేది. అప్పట్లో విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని చూసి ముగ్దుడైపోయిన టేలర్.. తన కూతుర్ని ఒక మాట అడిగాడు.. విరాట్ కోహ్లీ చేసుకుంటావా అని సరదాగా ప్రశ్నించాడు.. అయితే దానికి ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండిపోయిందట. ఇదే విషయాన్ని టేలర్ ఇటీవల వెల్లడించాడు..
“అప్పట్లో విరాట్ కోహ్లీ టీమిండియా కు సారథి అయ్యాడు. ఆ తొలి రోజుల్లోనే విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నాను. అదే విషయాన్ని అతడి మేనేజర్ వద్ద ప్రస్తావిస్తే.. చివరికి ఒప్పుకున్నాడు. ఇంటర్వ్యూ చేసే రోజు రానే వచ్చింది. ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ ఎంతో ఓపికతో ఉన్నాడు. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అతడి వ్యవహార శైలి నాకు బాగా నచ్చింది. అతడు అత్యంత నిదానంగా ఉన్నాడు. నెమ్మదిగా సమాధానం చెప్పాడు. తనకు వ్యతిరేకంగా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం సానుకూల ధోరణిలోనే చెప్పాడు. అతని వ్యక్తిత్వం నాకు మరింతగా నచ్చింది. ఆ తర్వాత అతడికి మరింతగా అభిమానినై అయిపోయాను. ఆ సమయంలో నా కూతుర్ని విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. కాకపోతే అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలు మాత్రమేనని” టేలర్ చెప్పుకొచ్చాడు.. టేలర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.