Unique bowling action: జెంటిల్మెన్ గేమ్ గా పేరుపొందిన క్రికెట్లో ఆటగాళ్లు రకరకాల విన్యాసాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. వివిధ రకాల టోర్నీల ద్వారా ఆటగాళ్లకు విపరీతమైన అవకాశాలు రావడం మొదలైన తర్వాత.. అనేక విధాలుగా క్రికెట్ ఆడుతున్నారు.. బ్యాటర్లు 360 డిగ్రీలలో బంతిని మైదానం చుట్టూ పరుగులు పెట్టిస్తున్నారు. బౌలర్ల కూడా బంతిని రకరకాలుగా తిప్పుతూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అందువల్లే క్రికెట్ రకరకాల విన్యాసాలకు వేదికలాగా మారుతోంది.
క్రికెట్లోకి అనేక రకాల కార్పొరేట్ శక్తులు ప్రవేశించిన తర్వాత రకరకాల లీగ్ పోటీలు జరుగుతున్నాయి.. ఈ పోటీల ద్వారా చాలామంది ప్లేయర్లకు ఆర్థికంగా స్థిరత్వం లభిస్తోంది. భారీగా ట్రాక్ రికార్డు ఉన్న ప్లేయర్లకు దండిగా నగదు లభిస్తోంది. అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం తమ ప్రదర్శన ద్వారా వచ్చే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతమంది రకరకాల విన్యాసాలకు పాల్పడుతున్నారు. అలా విన్యాసానికి పాల్పడిన కో ఆటగాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో ప్రకారం రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఓ బౌలర్ బంతి అందుకున్నాడు. బౌలింగ్ వేయడం మొదలుపెట్టాడు. బంతిని రకరకాలుగా తిప్పడం ప్రారంభించాడు. వాస్తవానికి అతడు బౌలింగ్ స్టైల్ చేస్తే నవ్వి నవ్వి పొట్ట పగిలిపోవడం ఖాయం.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్, అజంతామెండిస్ వంటి బౌలర్లకు డిఫరెంట్ బౌలింగ్ స్టైల్ ఉంది.. అయితే వారందరినీ ఒక మనిషిలో చూడాలంటే మాత్రం కచ్చితంగా ఇతడి బౌలింగ్ వీక్షించాల్సిందే. ఆ బౌలర్ బంతులు వేసే విధానం ఒక విధంగా ఉంటాయి.. బంతిని చేతివేళ్ల నుంచి వదిలే విధానం ఇంకొక రకంగా ఉంది.. అయితే బంతిని వేసే విధానంలో వైవిధ్యాన్ని చూపించిన అతడు.. బంతి పై మాత్రం ఆ స్థాయిలో పట్టు కొనసాగించలేకపోయాడు. అందువల్లే ప్రత్యర్థి బ్యాటర్ బంతి పడడమే ఆలస్యం బ్యాట్ అందుకొని కసికొద్ది కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.” నువ్వు ఎవడ్రా బాబు .. బంతిని ఇలా తిప్పుతున్నావ్.. అసలు ఇలా కూడా బౌలింగ్ వేస్తారా.. ఇలాంటి బౌలింగ్ ఎక్కడ నేర్చుకున్నావ్.. కావాలని చేస్తున్నావా.. సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం ఇష్టపడుతున్నావా.. ఏమైనా సరే నీ బౌలింగ్ చూసేందుకు విచిత్రంగా ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
MURALI + HARBHAJAN + WARNE + KUMBLE
– The best bowling action ever! I thought he was a left-hand bowler and then delivered the ball with his right-hand
– Batter got confused, even umpire is shocked
– A must watch video pic.twitter.com/FaCWQxI8EX
— Richard Kettleborough (@RichKettle07) November 5, 2025