David Warner: 2018లో కేప్ టౌన్ టెస్ట్ లో “సాండ్ పేపర్” ఘటన డేవిడ్ వార్నర్ కెరియర్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో అతడు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. జీవిత కాలం పాటు కెప్టెన్సీ పై నిషేధానికి గురయ్యాడు. అయితే ఈ నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కండక్ట్ కమిషన్ ఎత్తివేసింది. ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా కండక్ట్ కమిషన్ సమీక్ష నిర్వహించింది. ఇందులో డేవిడ్ వార్నర్ పై జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో డేవిడ్ వార్నర్ కు ఉపశమనం లభించింది.. 2022లో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళి లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ముగ్గురితో కమిషన్ ఏర్పాటు చేసింది.. అయితే ఆ కమిషన్ లోని ముగ్గురు వార్నర్ పై కెప్టెన్సీ పై నిషేధాన్ని ఎత్తివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం వెల్లడించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో “బిగ్ బాష్ లీగ్” లో డేవిడ్ వార్నర్ తిరిగి సిడ్ని థండర్స్ జట్టుకు సారధ్య బాధ్యత వహించే అవకాశం కలిగింది. ప్యానల్ ఎదుట డేవిడ్ వార్నర్ సాండ్ పేపర్ ఘటన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. కెప్టెన్సీ పై నిషేధం ఎత్తివేయడం ద్వారా యువ క్రికెటర్లకు డేవిడ్ వార్నర్ తన సహకారాన్ని అందిస్తాడని ప్యానల్ కమిటీ వెల్లడించింది.. అయితే నిషేధం వల్ల ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా ఉండే అవకాశాన్ని డేవిడ్ వార్నర్ 6 సంవత్సరాల పాటు కోల్పోయాడు.. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరించాడు.. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ కు 37 సంవత్సరాల వయసు. ఇటీవల అతడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
పాకిస్తాన్ జట్టు పై టెస్ట్ సిరీస్ తో..
ఏడాది ప్రారంభంలో డేవిడ్ వార్నర్ పాకిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడాడు. ఆ తర్వాత తన సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత విశ్రాంతి ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు, 2024 t20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు వెల్లడించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి గత రెండు సీజన్లో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయింది. మరి కొద్ది రోజుల్లో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదలవుతుంది. అయితే జట్టుకు అవసరమైతే భారత్ తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతానని వార్నర్ పేర్కొన్నాడు. అయితే వార్నర్ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత.. ఆస్ట్రేలియా జట్టుకు నాణ్యమైన ఓపెనర్ లభించకుండా పోయాడని ఇటీవల సీనియర్ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. ఈసారి ఎలాగైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. డేవిడ్ వార్నర్ కూడా జట్టులోకి రావాలని ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో.. కమిన్స్ కు బదులుగా అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పరిశీలిస్తుందని గ్లోబల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Relief to david warner australian cricket management is ready to give key responsibilities from now on
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com