RCBvPBKS Final : అప్పటికే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 2.4 ఓవర్ వద్ద ప్రభ్ సిమ్రాన్ సింగ్ భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న షెఫర్డ్ చేతిలోకి వచ్చిన క్యాచ్ మిస్ చేశాడు. అయితే ఈసారి అలాంటి తప్పుకు బెంగళూరు ఆటగాళ్లు ఆస్కారం ఇవ్వలేదు. హేజిల్ వుడ్ బౌలింగ్లో 4.6 ఓవర్ వద్ద పంజాబ్ ఓపనరు ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్ కొట్టాడు. అది అమాంతం బౌండరీ లైన్ దాటే విధంగా కనిపించింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్.. ఆ బంతిని అమాంతం అందుకున్నాడు. ఆ తర్వాత తన శరీర బరువును ఆపుకోలేక బంతిని మైదానంలోకి విసిరేశాడు. ఇదే సమయంలో ఒక్క ఉదుటన మైదానంలోకి పరిగెత్తి ఆ బంతిని అందుకున్నాడు. తద్వారా ఆర్య ఒక్కసారిగా బిత్తర పోయాడు. అప్పటికి పంజాబ్ జట్టు స్కోర్ 43 పరుగుల వద్దకు చేరుకుంది. మరోవైపు ఆర్య 19 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ ల సహాయంతో 24 పరుగులు చేశాడు.
అప్పటికే పంజాబ్ ఓపెనర్లు 43 పరుగులు చేయడంతో ఒక రకంగా బెంగళూరు ప్లేయర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. వికెట్ సాధించాల్సిన సమయంలో.. షెఫర్డ్ విలువైన క్యాచ్ వదిలేసాడు. అది అత్యంత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో.. హేజల్ వుడ్ అద్భుతమైన బంతివేసి ఆర్యను రెచ్చగొట్టాడు. అతడు రెచ్చిపోయి భారీగా షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. చివరికి సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. ఐపీఎల్ ఫైనల్ లో ఇలాంటి రేర్ క్యాచ్ పట్టి.. సాల్ట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకవేళ గనుక ఈ మ్యాచ్ ఫలితం బెంగళూరుకు అనుకూలంగా వస్తే మాత్రం సాల్ట్ పై అభినందనలు కురుస్తాయి. ఎందుకంటే అతడు పట్టిన క్యాచ్ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది కాబట్టి.. ఇక ఈ కథనం రాసే సమయం వరకు 8.4 ఓవర్లలో పంజాబ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆర్య(24), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (26) పెవిలియన్ చేరుకున్నారు.
Pause it. Rewind it. Watch it again
Phil Salt with a clutch grab under pressure ❤
Was that the game-defining catch?
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets pic.twitter.com/o0gpkjLOCV
— IndianPremierLeague (@IPL) June 3, 2025