Pat Cummins ruled out: మరి కొద్ది రోజుల్లో శ్రీలంక, భారత్ వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈసారి ఏకంగా 20 జట్లు టి20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ నిష్క్రమించడంతో.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఆడబోతుంది. ఈసారి జరిగే పోరు ఉత్కంఠ గా సాగుతుందని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ అందుకునే సత్తా ఉన్న జట్లలో ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉంటుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ విభాగానికి కమిన్స్ నాయకత్వం వహిస్తాడని కంగారు క్రికెట్ మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు అతడు గాయపడడంతో ఒక్కసారిగా కంగారు జట్టు మేనేజ్మెంట్ ప్రణాళికలు తలకిందులయ్యాయి.
2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలవడంలో కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. అయితే 2026 లో జరిగే టి20 వరల్డ్ కప్ లో కూడా అటువంటి పాత్ర పోషించి.. తన పేరును చరితార్థం చేసుకోవాలని కమిన్స్ భావించాడు. ఇటీవల యాషెస్ సిరీస్ లో ఒక మ్యాచ్ ఆడిన అతడు.. ఆ తర్వాత కనిపించలేదు. టి20 వరల్డ్ కప్ ముందు వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి అతడు ఆ పని చేశాడని అందరూ అనుకున్నారు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఆ మ్యాచ్ తర్వాత అతడు గాయపడ్డాడని.. దాని నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. టి20 వరల్డ్ కప్ వరకు అతడు జట్టుకు అందుబాటులోకి వస్తాడని మేనేజ్మెంట్ కూడా ప్రకటించింది. కానీ గాయం తగ్గకపోవడంతో అతడి స్థానంలో మరొక ఆటగాడిని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ప్రకటించింది. అంతేకాదు గతంలో ప్రకటించిన జట్టులో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. కమిన్స్, షార్ట్ స్థానంలో పేస్ బౌలర్ ద్వార్ష్ యిస్, రెన్ షా కు చోటు కల్పించింది. ఇక ఆస్ట్రేలియా జట్టుకు మార్ష్ నాయకత్వం వస్తున్నాడు. బార్ట్ లెట్, కూపర్, డేవిడ్, ఎల్లిస్, హేజిల్ వుడ్, ద్వార్ష్ యిస్, రెన్ షా, కుహ్నెమన్, మాక్స్ వెల్, స్టోయి నిస్, జంపా, రెన్ షా, ఇంగ్లిస్ ను ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసింది. అయితే ఈ ప్లేయర్లలో చాలామంది హిట్టర్లు ఉన్నారు.