PAK vs SA highlights: ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీని అందుకుంది. అంతేకాదు ఐసీసీ నిర్వహించిన మేజర్ ట్రోఫీని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అటువంటి దక్షిణాఫ్రికా జట్టు పేలవమైన పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో 2025 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను పాకిస్తాన్ ఓటమితో మొదలుపెట్టింది.
పాకిస్తాన్ దేశంలో పర్యటిస్తున్న సౌత్ ఆఫ్రికా.. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్ లో భాగంగా పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు లాహోర్ వేదికగా తొలి టెస్ట్ ఆడింది.. బౌలింగ్లో అదరగొట్టినప్పటికీ.. బ్యాటింగ్లో సౌత్ ఆఫ్రికా విఫలమైంది.. తద్వారా పాకిస్తాన్ జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించింది.. వాస్తవానికి ఈ మ్యాచ్లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. అయితే తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ జట్టు సాధించిన ఆధిక్యం ఆ జట్టును గెలుపు దిశగా ప్రయాణించేలా చేసింది. రెండు జట్లలో స్పిన్ బౌలర్లు అత్యుత్తమంగా ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ జట్టు తరఫున నౌమన్ 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ముత్తుస్వామి 10 వికెట్స్ సొంతం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 378 పరుగులు చేసింది.. పాకిస్తాన్ బ్యాటర్లలో నలుగురు హాఫ్ సెంచరీలు చేశారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ముత్తుస్వామి తొలి, తుది ఇన్నింగ్స్ లలో 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 167 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌత్ ఆఫ్రికా ఎదుట పాకిస్తాన్ 277 రన్స్ టార్గెట్ విధించింది. ఈ పరుగులను ఛేదించడంలో సౌత్ ఆఫ్రికా విఫలమైంది. నౌమన్ దూకుడుతో సౌత్ ఆఫ్రికా విలవిలాడిపోయింది. దీంతో లక్ష్యానికి 94 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌత్ ఆఫ్రికా జట్టులో బ్రేవిస్ (54) మాత్రమే ఆకట్టుకున్నాడు. ఇక ఈ సిరీస్ లో రెండో టెస్టు అక్టోబర్ 20 నుంచి రావల్పిండి ప్రాంతంలో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత మూడు t20 లు, మూడు వన్డేల సిరీస్ లు కూడా ఉన్నాయి.