ఇటీవల టీమిండియా ఇంగ్లాండ్ జట్టులో పర్యటించింది. 5 టెస్టుల సిరీస్ ఆడింది.. ఆ సిరీస్ లో ఆతిధ్య జట్టుకు సమవుజ్జిగా నిలిచింది. అంతేకాదు ఆ సిరీస్ లో గిల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గిల్ ఇటీవల వెస్టిండీస్ సిరీస్ లోనూ అదరగొట్టాడు. వెస్టిండీస్ జట్టు మీద సెంచరీల మోత మోగించాడు. దీంతో అతని ఆట మీద అందరికీ ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది. వాస్తవానికి ఆస్ట్రేలియా సిరీస్ కు అతడిని సారధిగా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగానే ఈ మార్పులు చేశామని మేనేజ్మెంట్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు టీమిండియా ఒకప్పటి సారథి రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిగా మారిపోయాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇంకా బలమైన ప్లేయర్లు టీమిండియాలో ఉండడంతో.. ఆతిథ్య జట్టుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
పెర్త్ వన్డే కు ముందు టీమిండియా సారధి గిల్, ఆస్ట్రేలియా ఆటగాడు మార్ష్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఇద్దరు ట్రోఫీ పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వన్డే సారధిగా గిల్ కు ఇది తొలి సిరీస్. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్లో తను ఏమిటో నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డమీద తన ప్రతాపం ఏమిటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో 3 వన్డేలు ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్లు ఉదయం 8 గంటలకు మొదలవుతాయి.
ట్రోఫీని అందుకొని ఫోటోలకు పోజు ఇచ్చిన గిల్.. సౌకర్యవంతంగా కనిపించాడు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. బలమైన ఆస్ట్రేలియాను ఓడించగలగమనే సత్తా అతనిలో ప్రస్ఫుటంగా దర్శనమిస్తోంది. విలేకరుల సమావేశంలో కూడా సౌకర్యవంతంగా మాట్లాడాడు. ఆస్ట్రేలియా ను ఓడించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని గిల్ పేర్కొన్నాడు. జట్టులో ఒకటో స్థానం నుంచి తొమ్మిదవ స్థానం వరకు అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారని.. ఈసారి ఆస్ట్రేలియాను గట్టిగా ఢీకొడతామని గిల్ ప్రకటించాడు.
. . #TeamIndia Captain Shubman Gill and Australian skipper Mitchell Marsh meet ahead of the 1️⃣st ODI #AUSvIND | @ShubmanGill pic.twitter.com/MBPaB2iL0R
— BCCI (@BCCI) October 18, 2025