Harmanpreet Kaur Tattoo: దశాబ్దాల నిరీక్షణ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించింది. మన దేశం వేదికగా జరిగిన ఈ సమరంలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మీద గెలిచిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో తలపడిన టీమిండియా.. గెలిచే మ్యాచ్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి సెమీఫైనల్ వెళ్ళిపోయింది. సెమీఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే హైయెస్ట్ రన్ స్కోర్ చేజ్ చేసి రికార్డు సృష్టించింది. అటు పురుషుల క్రికెట్లోనూ ఈ ఘనతను ఏ జట్టు కూడా సాధించలేదు.
సెమి ఫైనల్ విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లిపోయింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడింది. చివర్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో టీమ్ ఇండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. తద్వారా సంవత్సరాలుగా ఊరిస్తున్న వన్డే వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ లో సాధించిన విజయం ద్వారా టీమ్ ఇండియాకు 39 కోట్ల నగదు బహుమతి లభించింది. టీమిండియా సాధించిన అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ 51 కోట్ల నజరానా ప్రకటించింది. ఇంకా ప్రైవేట్ వ్యాపారులు మన భారత క్రికెటర్లకు ఖరీదైన కానుకలు.. బహుమతులు ఇస్తున్నారు.
ఇంకా టీమిండియా కు వన్డే వరల్డ్ కప్ అందించిన ఘనతను హర్మన్ ప్రీత్ కౌర్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ సందర్భాన్ని అరుదైన జ్ఞాపకం లాగా మార్చుకోవాలని ప్రయత్నించింది.. తన చేతి మీద వరల్డ్ కప్ టాటూ వేయించుకుంది. ఇది ఎప్పటికీ నిలిచిపోతుందని ఆమె పేర్కొంది.. టాటూ వేయించుకున్న తర్వాత ఆ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. తన చర్మంతో పాటు తన హృదయంలో ఎప్పటికీ ఈ ట్రోఫీ నిలిచిపోతుందని ఆమె పేర్కొంది.. ” తొలి రోజు నుంచి నీకోసం ఎదురు చూశాను. ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నాను. ఇకపై ప్రతిరోజు నిన్ను నాలో చూసుకుంటాను.. జీవితం చివరి వరకు కృతజ్ఞతతో ఉంటానని” కౌర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
హర్మన్ ప్రీత్ కౌర్ ఈ టోర్నీలో టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొన్నప్పుడు అనేక విమర్శలు చవిచూశారు. అనేకమంది తిట్లు తిడుతుంటే భరించారు. ఆ విమర్శలను, తిట్లను విజయ సోపానాలుగా మలుచుకున్నారు. చివరికి టీం ఇండియాను విజేతగా నిలిపారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఒత్తిడిలో ఉన్నప్పుడు అనేక ప్రణాళికలు రూపొందించారు. బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే వర్మ , శర్మకు బంతి అందించి ఫలితాన్ని రాబట్టారు. చివర్లో క్యాచ్ కూడా అందుకొని టీమిండియా విజయంలో అద్భుతమైన పాత్ర పోషించింది కౌర్.
View this post on Instagram