Allu Arjun-Ram Charan: టాలీవుడ్ లో స్టార్ నిర్మాతల లిస్ట్ తీస్తే మనకు గుర్తుకొచ్చే నలుగురిలో ఒకరు అల్లు అరవింద్(Allu Aravind). గీతా ఆర్ట్స్(Geetha Arts) అనే సంస్థని స్థాపించి 50 ఏళ్ళ నుండి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మన టాలీవుడ్ ఆడియన్స్ కి అందించాడు. ముఖ్యంగా తన బావ చిరంజీవి తో కలిసి ఈయన చేసిన చిత్రాలన్నీ ఇండస్ట్రీ లో చెక్కు చెదరని రికార్డ్స్ గా మిగిలిపోయాయి. ఇక రామ్ చరణ్ తీసిన ‘మగధీర’ చిత్రం అయితే మన ఇండస్ట్రీ రూపు రేఖలను మార్చేశాయి. ఈ సినిమాకి ముందు ఆయన బాలీవుడ్ అమీర్ ఖాన్ ‘గజినీ’ చిత్రాన్ని రీమేక్ చేసి, బాలీవుడ్ కి మొట్టమొదటి 100 కోట్ల నెట్ సినిమాని అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఈమధ్య కాలం లో అల్లు అరవింద్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడం లేదు. తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీ సినిమాలు తీస్తూ సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడు.
ఈమధ్య కాలం లో అల్లు అరవింద్ చెయ్యి పడిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రీసెంట్ గా వీళ్ళ బ్యానర్ నుండి ‘కాంతారా 2’ చిత్రం విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము. ఇప్పుడు ఇదే బ్యానర్ నుండి ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా తెరకెక్కింది. నవంబర్ 7న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా విడుదల అవ్వబోతున్న సందర్భంగా కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ ప్రెస్ మీట్ కి అల్లు అరవింద్ కూడా విచ్చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన్ని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఒక విలేఖరి అల్లు అరవింద్ ని ప్రశ్న అడుగుతూ ‘మీరు స్థాపించిన గీత ఆర్ట్స్ కి 50 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ ఈమధ్య కాలం లో మీరు ఇతర నిర్మాతలు లాగా భారీ బడ్జెట్ సినిమాలు చేయడం లేదు. సేఫ్ సైడ్ గా వెళ్తున్నారు, రిస్క్ ఎందుకు చేయడం లేదు?’ అని అడగ్గా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ చిత్రం కూడా నాకు రిస్కీ ప్రాజెక్ట్ నే. ఇండస్ట్రీ లో ఏ నిర్మాతకు అయినా సినిమా తీయడం అంటే రిస్క్ నే. 450 ,500 కోట్లు పెట్టి సినిమాలు ఎందుకు తీయడం లేదు అని డైరెక్ట్ గా అడిగేయండి చెప్తా’ అని అంటాడు. అయితే చెప్పండి అని విలేఖరి అడగ్గా ‘రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు తీయాలని ఉంది. వాళ్లకు భారీ రెమ్యూనరేషన్స్ ఇచ్చుకోవాలి. అవి ఎలాగో మా ఇంటికే తీసుకొస్తారు కాబట్టి, మేము డబ్బులిచ్చి మా ఇంటికే మళ్లీ ఆ డబ్బులని తీసుకొని రావడం కన్నా, బయట వాళ్ళు డబ్బులు ఇవ్వడమే బెటర్ అని వాళ్ళతో సినిమాలు చేయడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.