Goat and 2 Bottles Oil: ఒక ఆటను ప్రోత్సహించడానికి.. ఉత్తమంగా ఆడిన ప్లేయర్లకు రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తుంటారు. క్రికెట్లో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ అఫ్ ది సిరీస్ పురస్కారాల కింద నగదు, ఇతర ట్రోఫీలను అందిస్తుంటారు. ఇలా ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు అందివ్వడం వల్ల వారు మెరుగ్గా క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు భావిస్తుంటారు.
మన దేశంలో క్రికెట్ అంటే విపరీతమైన క్రేజీ ఉంటుంది. అందువల్ల ప్లేయర్లకు విశిష్టమైన పురస్కారాలు లభిస్తుంటాయి. అందువల్లే మనదేశంలో క్రికెట్ ఆడేందుకు చాలామంది యువత ఆసక్తిని చూపిస్తుంటారు. ఇతర దేశాలలో కూడా క్రికెట్ టోర్నీలు జరిగినప్పుడు ప్లేయర్లకు పురస్కారాలు అందిస్తుంటారు. నగదు బహుమతి కూడా ఇస్తుంటారు. అయితే పాకిస్తాన్లో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ క్రికెట్ ఆడే విషయంలో.. క్రికెటర్లకు పురస్కారాలు అందించే విషయంలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అటువంటి సంఘటన ఇటీవల ఒకటి చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
పాకిస్తాన్ దేశంలో లోకల్ టోర్నీ జరిగింది. ఈ టోర్నీలో ఒక ఆటగాడు సత్తా చూపించాడు. వాస్తవానికి మనదేశంలో ఇటువంటి ప్రదర్శన గనుక ఏ ఆటగాడు అయినా చేస్తే కచ్చితంగా అతనికి నగదు బహుమతులు లభించేది. ట్రోఫీ కూడా దక్కేది. కానీ పాకిస్తాన్లో అన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి.. అద్భుతంగా ఆడిన ఆటగాడికి ఒక మేక, మూడు ఆయిల్ క్యాన్లను ఇచ్చారు. అంతేకాదు వీటిని ఇవ్వడం గొప్పగా చెప్పుకున్నారు. మేకను కోసుకొని, ఇచ్చిన ఆయిల్ తో వంట వండుకొని తినాలట. పైగా మేకను తింటే శరీరానికి ప్రోటీన్లు విపరీతంగా అంది.. మెరుగైన ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుందట. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పడి పాకిస్తాన్ పరువు పోతోంది. “ఎవడైనా క్రికెట్లో గొప్పగా ఆడితే.. నగదు ఇస్తారు. ట్రోఫీలు బహూకరిస్తారు. కానీ ఇక్కడ అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. మేకను, ఆయిల్ క్యాన్లను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం కింద ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
If you win Player of the Match in Pakistan, you get a goat and two bottles of oil as a prize. pic.twitter.com/TsAvTEN1JZ
— Aditya (@Warlock_Aditya) December 20, 2025