Arjun-Tendulkar: ఎత్తుకు ఎత్తు.. బలమైన శరీర సౌష్టవం.. అదే స్థాయిలో బౌలింగ్ వేసే నేర్పరితనం.. ఇలా చెప్పుకుంటే ఎన్నో మెరిట్స్ ఉన్నాయి. అయినా ఏం ఉపయోగం? అన్నీ ఉన్నప్పటికీ అల్లుడు నోట్లో శని అన్నట్టుగా ఈ ఆటగాడి పరిస్థితి ఉంది.
బలమైన నేపథ్యం.. అదే స్థాయిలో అవకాశాలు.. అంతకుమించి అన్నట్టుగా ఆర్థిక పరిపుష్టం… ఇవన్నీ ఈ ఆటగాడికి ఉన్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ లాగా ఐపీఎల్ ప్రతి సీజన్లోనూ ఇతడిని ముంబై జట్టు తన బృందంలో ఉంచుకుంటుంది. కానీ అతడేమో ప్రతిభ చూపించలేడు. ప్రతిభను ప్రదర్శించే అవకాశం వచ్చినా వినియోగించుకోలేడు. లోపం అతడిలో ఉందా? లేక అతడికి ఓవర్ కాన్ఫిడెన్సా.. అనేది ఇప్పటికి అంతు పట్టడం లేదు. అసలు ఎందుకు అతడు అలా ఉంటున్నాడు? తనను తాను ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాడు? దీనిపై అనేక సందర్భాలలో విశ్లేషణలు వచ్చినప్పటికీ.. అతని ఆటలో మార్పు రావడం లేదు. అతని ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు.
ఇంత చదివిన తర్వాత ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. మేం చెబుతున్నది సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురించి అని.. అర్జున్ టెండూల్కర్ కు వచ్చిన అవకాశాలు మరొక ఆటగాడికి వచ్చి ఉంటే అతను కచ్చితంగా క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలేవాడు. ఈ కాలంలో అద్భుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకునే వాడు. కానీ ఎందుకనో సచిన్ కుమారుడు ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. గత సీజన్లో హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్లో అవకాశం ఇచ్చినప్పటికీ అర్జున్ టెండూల్కర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈ సీజన్లో అయితే ఒక మ్యాచ్లో కూడా అతడికి అవకాశం లభించలేదు. వాస్తవానికి మెగా వేలంలో అతడిని ముంబై జట్టు కొనుగోలు చేసిన విషయం కూడా ఎవరికీ తెలియదంటే.. అతని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సచిన్ చేసిన ఒత్తిడి వల్ల ముంబై జట్టు అతనిని కొనుగోలు చేస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఎటువంటి ప్రకటన అధికారికంగా రాలేదు. ఇక ముంబై జట్టులో ఉన్నప్పటికీ అతడికి ఆడే అవకాశం రాలేదు. రిజర్వ్ బెంచుకు మాత్రమే పరిమితమయ్యాడు. జట్టు విజయాలు సాధించినప్పుడు జరిపిన వేడుకలో భాగమయ్యాడు.
Read Also: తండ్రైన స్టార్ క్రికెటర్.. ట్వీట్ వైరల్
ఇక ముంబై లీగ్ లో కూడా అతనిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అటు ఐపిఎల్ లో కూడా అతనికి ఆడే అవకాశం లభించలేదు. ఇక ఇప్పుడు రంజి ట్రోఫీలు కూడా పెద్దగా లేవు. ఖాళీగా ఉండి ఏం చేయాలి అనుకున్నాడేమో.. లేక ఒంటరిగా ఉంటే పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయేమో.. తెలియదు కానీ మొత్తానికి దుబాయ్ టూర్ చెక్కేశాడు. అతడితోపాటు సోదరి సారా టెండుల్కర్ కూడా ఉంది. మొత్తంగా వారిద్దరూ దుబాయిలో విహరిస్తున్నారు. వారి వెంట కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను వారు తమ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. అర్జున్ లాంటి ఆటగాళ్లు ఈ సమయంలో వెళ్లాల్సింది వెకేషన్ కు కాదని.. ఆట మీద చూపించాల్సిన డెడికేషన్ గురించి ఆలోచించాలని.. అప్పుడే అతడు గొప్ప ప్లేయర్ గా స్థిరపడతాడని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.