India Vs Pakistan World Cup: 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియన్ టీం కి ,పాకిస్థాన్ టీమ్ కి మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగనుంది. ఇప్పటికే ఈ ఇరుజట్లు కూడా రెండు మ్యాచ్ ల్లో గెలిచి మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ లో ఏ టీమ్ ఆధిపత్యం కొనసాగిస్తుంది అనే. ప్రశ్న కి సమాధానం చెప్పాలంటే మాత్రం ఈ మ్యాచ్ జరిగే అంత వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ రెండు టీములు కూడా ఇప్పుడు అత్యంత బలమైన టీములుగా ఉన్నాయి.
ఇక ఇప్పటికే ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ ని ఓడించి డామినేట్ చేసినప్పటికీ మన మీద రివెంజ్ తీర్చుకోడానికి పాకిస్తాన్ టీం రెడీగా ఉంది. ఇక ఈ క్రమంలో ఇండియా ఇప్పటివరకు ఏడుసార్లు పాకిస్తాన్ టీం ని వరల్డ్ కప్ లో ఓడించి ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తుంది. ఇక దీంట్లో భాగంగానే ఈరోజు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ని 1,30,000 మంది వీక్షకులు చూడబోతున్నట్టుగా తెలుస్తుంది.అంత మంది మధ్యలో ఈ రెండు టీములు తలపడుతూ ఉండటం నిజంగా విశేషం అనే చెప్పాలి. వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ కు దక్కని అరుదైన గౌరవం కూడా ఈ రెండు టీం ల మధ్య జరిగే పోటీకి దక్కడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
ఇక ఈ మ్యాచ్ కోసం రెండు టీములు కూడా ప్లేయింగ్ 11 లో భారీ మార్పులు అయితే చేస్తున్నాయి.అందులో ముందుగా ఇండియన్ టీం ను కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న శుభ్ మన్ గిల్ ఇండియన్ టీం ఓపెనర్ ప్లేయర్ గా ఈ మ్యాచ్ లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక గిల్ రాకతో ఇండియన్ టీమ్ మరింత బలంగా తయారైందనే చెప్పాలి. ఇక దీనితో పాటు గా రోహిత్ శర్మ కూడా తనదైన క్లాస్ ఇన్నింగ్స్ ఆడడానికి రెడీగా ఉన్నాడు. అలాగే బౌలింగ్ విషయంలో శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరిలో ఎవరినో ఒక్కరిని తీసుకునే ఆలోచన లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో అశ్విన్ కి ఎక్కువగా ఆడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది…
ఇక ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ భారం అంత టీమ్ మొత్తం కలిసి మోయాబోతుంది. ఇక పేస్ బాద్యతలు మొత్తం సిరజ్, బుమ్రా లు చూసుకోనున్నారు..స్పిన్ విభాగాల్లో అశ్విన్, కుల్దిప్ యాదవ్, రవీంద్ర జడేజా చూసుకుంటారు…
ఇక ఇండియన్ ప్లేయింగ్ 11 ని కనక ఒకసారి చూసుకుంటే ఓపెనర్లుగా రోహిత్ శర్మ , శుబ్ మన్ గిల్ ఉన్నారు. అలాగే నెంబర్ త్రీ లో విరాట్ కోహ్లీ ,నెంబర్ ఫోర్ లో కేఎల్ రాహుల్, నెంబర్ ఫైవ్ లో శ్రేయ అయ్యర్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ సెవెన్ లో రవీంద్ర జడేజా, నెంబర్ ఎయిట్ లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ నైన్ లో కుల్దీప్ యాదవ్, నెంబర్ టెన్ లో మహమ్మద్ సిరాజ్ , నెంబర్ 11 లో జస్ప్రత్ బుమ్రా లు ఉన్నారు…
ఇక పాకిస్తాన్ టీం విషయానికి వస్తే వీళ్లు కూడా 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో ఇండియాని ఏ విధంగా అయితే ఓడించారో ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.దానికి తోడు మొన్న జరిగిన ఏషియా కప్ లో ఇండియా మీద ఘోరంగా ఓడిపోవడంతో పాకిస్తాన్ టీం గోర అవమానాన్ని మూటగట్టుకుంది.దానివల్ల ఇప్పుడు గెలిచి రివెంజ్ తీర్చుకోడానికి పాకిస్థాన్ టీమ్ ఈసారి బరిలోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయింగ్ 11 లో కూడా భారీ మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది…
ఇక వీళ్ళ బ్యాటింగ్ భారం అంత ఓపెనర్ అయిన శఫిక్ ,బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ లాంటి ప్లేయర్లు చూసుకోవడానికి రెఢీ అవుతున్నారు…ఇక స్పిన్నర్లు గా నవాజ్, శాదబ్ ఖాన్ లు ఉన్నారు. పేస్ బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది ,హరీష్ రావుఫ్ లా మీద భారం ఉండనుంది…….
వీళ్ళ ప్లేయింగ్ 11 కనక ఒకసారి చూసుకుంటే
ఓపెనర్లు గా అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ ఉన్నారు నెంబర్ త్రీ లో బాబర్ ఆజామ్, ఫోర్ లో మహమ్మద్ రిజ్వాన్, నెంబర్ ఫైవ్ లో సౌద్ షకీల్, నెంబర్ సిక్స్ లో ఇఫ్తికర్ అహ్మద్, నెంబర్ సెవన్ లో షాదాబ్ ఖాన్, నెంబర్ ఎయిట్ లో మహమ్మద్ నవాజ్,నెంబర్ నైన్ లో షాహిన్ అఫ్రిది, నెంబర్ టైన్ లో హసన్ అలీ/మహమ్మద్ వసీం,నెంబర్ లెవన్ లో హ్యారీస్ రావుఫ్ లాంటి ప్లేయర్లతో పాకిస్థాన్ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది చూడాలి మరీ ఇవాళ్ళ తుది పోరు లో గెలిచేది ఎవరో…