Dil Raju: కోట్ల విలువైన దిల్ రాజు అల్లుడు కారు చోరీ… కేసులో ఊహించని ట్విస్ట్

రంగంలోకి దిగిన పోలీసులు నగరంలోని ట్రాఫిక్ కెమెరాలు పరిశీలించారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్ ని కారు జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ పోలీసులకు సమాచారం అందించారు.

Written By: Shiva, Updated On : October 14, 2023 11:33 am

Dil Raju

Follow us on

Dil Raju: దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి ఖరీదైన కారు చోరీ గురికావడం కలకలం రేపింది. కారును దొంగతనం చేసిన వ్యక్తి ఇచ్చిన ట్విస్ట్ కి పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడైన అర్చిత్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ లో గల దస్పల్లా హోటల్ ముందు పోర్షే కారు ఆపి లోపలికి వెళ్ళాడు. ఓ అరగంట తర్వాత తన పని చేసుకుని బయటకు వచ్చాడు. పార్క్ చేసిన చోట కారు లేదు. దాంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు నగరంలోని ట్రాఫిక్ కెమెరాలు పరిశీలించారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్ ని కారు జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు దొంగిలించిన వ్యక్తి సమాధానాలు విని పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది.

నేను ఆకాష్ అంబానీ అసిస్టెంట్ ని, తెలంగాణ మంత్రి కేటీఆర్ కారును తీసుకురమ్మంటే ఈ పని చేశాను. హృతిక్ రోషన్ నా అసిస్టెంట్. ఆయన్ని తీసుకుని ఆకాష్ అంబానీని కలవాలి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నిందితుడి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అతడి పేరు సాయి కిరణ్ కాగా మన్సూరాబాద్ వాసి. అతడికి మతిస్థిమితం లేదు. ఇటీవల చికిత్స కూడా తీసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

దాంతో పోలీసులు సాయి కిరణ్ ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దొంగిలించబడిన ఆ కారు ధర ఏకంగా రూ. 1.7 కోట్లని సమాచారం. ఇంతటి ఖరీదైన కారును అంత తేలిగ్గా మతిస్థిమితం లేని వ్యక్తి ఎలా దొంగిలించాడనే చర్చ జరుగుతుంది. ఇక దిల్ రాజు మొదటి భార్యకు హన్షిత రెడ్డి అనే కూతురు ఉంది. ఆమె భర్తనే అర్చిత్ రెడ్డి. అమెరికా నుండి హైదరాబాద్ కి మకాం మార్చిన హన్షిత రెడ్డి నిర్మాతగా మారింది.