https://oktelugu.com/

Cricket Stadium : మోడీ స్టేడియాన్ని మించి.. ఏపీలో దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం.. ఆ ప్రాంతంలో ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఇంతకూ ఎక్కడంటే ?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో 1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) భావిస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : January 27, 2025 / 05:18 PM IST
    Cricket Stadium

    Cricket Stadium

    Follow us on

    Cricket Stadium : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో 1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) భావిస్తోంది.

    స్టేడియం కోసం భూసేకరణ
    ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. స్టేడియం కోసం 60 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం కన్నా మెరుగైన స్టేడియాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

    బీసీసీఐ సహాయాన్ని కోరుతున్న ఏసీఏ
    ఈ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలని, అదనంగా కొన్ని నిధులను స్థానికంగా సమీకరించనున్నట్లు ఏసీఏ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక అకాడమీలను నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    మూడు క్రికెట్ అకాడమీలు
    క్రికెట్ టాలెంట్‌ను మెరుగుపరచేందుకు విజయవాడ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయాలని ఏసీఏ నిర్ణయించింది. ఈ అకాడమీలకు రాబిన్ సింగ్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లను కోచింగ్ టీమ్‌లో భాగం చేయనున్నారు.

    ఐపీఎల్‌కు 15 మంది ప్లేయర్ల ఎంపిక లక్ష్యం
    ఏసీఏ తరఫున త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (APL) నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రం నుంచి వచ్చే రెండేళ్లలో కనీసం 15 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌కు ఎంపిక కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    విశాఖపట్నం స్టేడియానికి ఆధునీకరణ
    ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం విశాఖపట్నం స్టేడియాన్ని ఆధునీకరించేందుకు రూ.50 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, ఈ నెలాఖరులో విజయనగరంలో క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

    అమరావతిలో స్పోర్ట్స్ సిటీ
    రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తోంది. 2029 నేషనల్ గేమ్స్‌ను అమరావతిలో నిర్వహించేందుకు బిడ్ వేయనున్నట్లు సమాచారం. క్రికెట్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో, త్వరలోనే అమరావతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.