Homeజాతీయ వార్తలుArudhra Radar India : అమెరికా ఎఫ్ 35 ఖతం.. పాక్ పని పట్టడం ఖాయం.....

Arudhra Radar India : అమెరికా ఎఫ్ 35 ఖతం.. పాక్ పని పట్టడం ఖాయం.. మన స్వదేశీ ’ఆరుద్ర’ రాడర్ వచ్చేసింది.. విశేషాలివీ

Arudhra Radar India : నేటి కాలంలో యుద్ధాలు వేరే విధంగా సాగుతున్నాయి. బాంబులు కాకుండా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన మిస్సైల్స్ ద్వారానే యుద్ధాలు నడుస్తున్నాయి.. ఇటువంటి అప్పుడు యుద్ధాలు చేయడం.. మిస్సైల్స్ సంధించడం మాత్రమే కాదు.. శత్రు దేశాల యుద్ధ విమానాలను కూడా పసిగట్టడం.. వాటిని కూల్చేయడం యుద్ధంలో ఒక భాగమే.

ఇప్పటివరకు ఇలా శత్రు దేశాల యుద్ధ విమానాలను గుర్తించే టెక్నాలజీ అమెరికా, చైనా, ఇజ్రాయిల్, వంటి దేశాల వద్ద ఉండేది. మన దగ్గర కూడా ఉన్నప్పటికీ.. అత్యాధునిక స్థాయిలో ఉండేది కాదు. ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలలో పరిణామాలు మారిపోతున్న నేపథ్యంలో.. మన డిఫెన్స్ వ్యవస్థ కూడా అత్యంత ఆధునిక రూపును సంతరించుకుంది. ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ వైమానిక దళం కోసం.. గగనతల నిఘా రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిని డిఫెన్స్ రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) రూపొందించింది.. ఈ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఈ రాడార్ వ్యవస్థకు ఆరుద్ర అనే పేరు పెట్టారు.

ఆరుద్ర రాడార్ వ్యవస్థ అజిముత్, ఎలివేషన్ ఇలా రెండింటి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ తో పని చేస్తూ ఉంటుంది. దీనిని ఫోర్ డి మల్టీ ఫంక్షన్ ఫేజ్డ్ రాడార్ అని పిలుస్తుంటారు. ఇది ఒకే సమయంలో.. టార్గెట్ దూరాన్ని.. దిశ.. వేగాన్ని వెంటనే గుర్తిస్తూ ఉంటుంది. ఇది 400 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను అత్యంత సమర్థవంతంగా గుర్తిస్తుంది. అంతేకాదు రెండు చదరపు మీటర్ల దూరంలో ఉన్న చిన్న యుద్ధ విమానాలను సైతం 300 కిలోమీటర్ల దూరం నుంచే కనిపెడుతుంది. భూమికి 100 మీటర్ల తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లు.. క్రూయిజ్ మిస్సెస్ నుంచి 30 కిలోమీటర్ల గరిష్ట ఎత్తులో వెళ్లే యుద్ధ విమానాలను సైతం ఇది ట్రాక్ చేయగలుగుతుంది. 360 డిగ్రీల రొటేషన్ లో ఇది నిఘా పెడుతుంది. ఒకే నిర్దిష్టమైన స్టార్టింగ్ మోడ్ లో కూడా పనిచేస్తూ ఉంటుంది.

ఇందులో అత్యంత ఆధునికమైన ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్ ఆర్ పో సిస్టమ్ ఉంటుంది.. ఇది ఆకాశంలో ప్రయాణిస్తుంది మన విమానమా.. లేక శత్రు దేశానికి సంబంధించిన విమానమా అని గుర్తిస్తుంది.. ఈశాన్య రాష్ట్రాలు.. జమ్ము కాశ్మీర్ వంటి ప్రాంతాలలో పటిష్టమైన నిఘాను దీని ద్వారా సాగించవచ్చు. కొండ ప్రాంతంలో నిత్యం పహారా కాయవచ్చు. దీనికోసం సరిగా మూడు సంవత్సరాల క్రితం రక్షణ శాఖ తన బడ్జెట్లో 2800 కోట్లు కేటాయించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థతో ఈ రాడార్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఇది అత్యంత అధునాతమైన స్టెల్త్ ఫైటర్ ఎఫ్ 35 ని కూడా గుర్తించింది. పైగా ఈ పరీక్షను పూర్తి ఏఐ ఆధారిత కంప్యూటర్ సిమిలేషన్ విధానంలో చేయడం విశేషం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Oktelugu Epaper
Exit mobile version