World Cup 2023: ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియా మీద ఫుల్ డామినేషన్ తో మ్యాచులు ఆడుతూ వరుస విజయాలను అందుకుంటుంది.ఇక ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న మన ప్లేయర్లు ఇప్పటికే 2 – 0 తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకున్నారు. ఇక మూడో వన్డే లో కూడా గెలిచి ఆస్ట్రేలియా ని వైట్ వాష్ చేయాలనీ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మీద వన్డే సిరీస్ ఓడిపోయిన ఆస్ట్రేలియా ఇప్ప్పుడు ఇండియా మీద కూడా ఓడిపోయి వాళ్ల పేలవమైన పెర్ఫామెన్స్ ని కంటిన్యూ చేస్తుంది…ఇక వరల్డ్ కప్ ముందు వాళ్ళు రెండు భారీ సిరీస్ లు ఓడిపోవడం వాళ్ళకి చాలా మైనస్ గా మారనుంది…
ఇక ఈ విషయం పక్కన పెడితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న అందరు ప్లేయర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి వరల్డ్ కప్ ఫైనల్ టీం లోకి ఎవరిని తీసుకుంటారు అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారింది.అయితే వరల్డ్ కప్ లో ఉండే ప్లేయింగ్ 11 టీం ఏది అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మొదట ఓపెనర్లు గా శుభ్ మన్ గిల్,రోహిత్ శర్మ ఇద్దరు ఉన్నారు, వీళ్లు ప్రస్తుతంమంచి ఫామ్ లో కూడా ఉన్నారు. ఇక వీళ్ల తర్వాత నెంబర్ త్రి లో విరాట్ కోహ్లీ, నెంబర్ ఫోర్ లో కె ఎల్ రాహుల్, నెంబర్ ఫైవ్ లో ఇషాన్ కిషన్, నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్య, నెంబర్ సెవన్ లో రవీంద్ర జడేజా,నెంబర్ ఎయిట్ లో అక్షర్ పటేల్, నెంబర్ నైన్ లో కుల్దీప్ యాదవ్, నెంబర్ టెన్ లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ లెవన్ లో జస్ప్రీత్ బుమ్రా లు ఉన్నారు.అయితే అప్పటి వరకు అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకొని టీంలోకి వస్తే ఆయన ఉంటాడు లేదా ఆయన ప్లేస్ లో రవిచంద్రన్ అశ్విన్ ని తీసుకునే అవకాశం ఉంది…
ఇక ఇక్కడ అందరికి ఒకటే డౌట్ శ్రేయాస్ అయ్యర్ ప్లేయింగ్ లెవన్ లో ఉండడం లేదా అనేది అయితే అయ్యర్ ని కూడా కొన్ని మ్యాచులని నెంబర్ ఫోర్ లో తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకు అయ్యర్ ని పక్కకి పెట్టాల్సి వచ్చింది అంటే కె ఎల్ రాహుల్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస హాఫ్ సెంచరీ లు చేస్తున్నాడు కాబట్టి ఆయననే ప్లేయింగ్ లెవన్ లో కంటిన్యూ అవుతాడు.అయితే రాహుల్ కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఒకవేళ ఇషాన్ కిషన్ ఏమైనా కొద్దిగా తడబడితే శ్రేయాస్ అయ్యర్ కనక టీం లోకి వస్తే అయ్యర్ నెంబర్ ఫోర్ లో ఆడుతాడు అప్పడు రాహుల్ నెంబర్ ఫైవ్ లో ఆడుతాడు…అయితే ఇషాన్ కిషన్ ప్లేస్ లో అయ్యర్ ని తీసుకోవచ్చు కదా అని అందరు అనుకుంటారు కానీ ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మెన్ కాబట్టి ఆయన టీం లో పక్క గా ఉంటాడు. ఆయన లేకపోతే ఇక నెంబర్ సెవన్ లో రవీంద్ర జడేజా వచ్చేంత వరకు ఒక్క లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ కూడా ఉండడు కాబట్టి ఇషాన్ కిషన్ ని టీం లో కంటిన్యూ చేస్తారు…ఇక సూర్య కుమార్ యాదవ్ ని తీసుకోవాలంటే వీళ్ల ముగ్గురిని దాటుకొని రావాలి కాబట్టి ఆయనకి అవకాశం రావడం కష్టమే…