Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి లాభమా? నష్టమా?

చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు మద్దతు కూడగట్టడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. ఈ విషయంలో వైసిపి అట్టర్ ఫ్లాఫ్ గా మిగిలింది. చివరికి తన వాళ్లనుకునే వారిని కూడా వైసిపి కలుపుకెళ్లలేని పరిస్థితిలో ఉంది.

Written By: Dharma, Updated On : September 25, 2023 3:00 pm
Follow us on

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీకి మంచే జరిగిందన్న టాక్ ప్రారంభమైంది. అధినేత అరెస్టుతో టిడిపి శ్రేణులు రగిలిపోతున్నాయి. స్థానిక అంశాల ప్రభావంతో ఇన్నాళ్ళూ బయటకు రాని పార్టీ శ్రేణుల సైతం.. రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టిడిపిని గెలిపించాలన్న స్లోగన్ క్రమేపీ పెరుగుతోంది. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పెరుగుతుందని టిడిపి అంచనా వేసింది. కానీ వైసీపీ దానిని కొట్టిపారేసింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం వైసీపీలో కలవరం కనిపిస్తోంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు మద్దతు కూడగట్టడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. ఈ విషయంలో వైసిపి అట్టర్ ఫ్లాఫ్ గా మిగిలింది. చివరికి తన వాళ్లనుకునే వారిని కూడా వైసిపి కలుపుకెళ్లలేని పరిస్థితిలో ఉంది. ఇది వైసీపీకి కచ్చితంగా రాజకీయంగా నష్టమే. వైసీపీకి అధికారం ఉందనే ఒకే ఒక ఉపశమనం తప్ప.. ఆ పార్టీ పూర్తిగా ఒంటరి అయింది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడున్నవారో స్పందిస్తున్నారు. చంద్రబాబుకు బాహటంగానే మద్దతు తెలుపుతున్నారు. చివరకు తెలంగాణలో అధికార బి ఆర్ ఎస్ నేతలు సైతం మద్దతు తెలపాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

చంద్రబాబు అరెస్టు అనంతరం తెలుగుదేశం పార్టీ అచేతనంగా మిగులుతుందని భావించారు. కానీ తమకున్న క్షేత్రస్థాయిలో బలాన్ని ఆ పార్టీ బాగానే ఉపయోగించుకుంటోం ది. అయితే వైసిపి ఏం చేస్తుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అవినీతి ఎలా జరిగింది? అందులో చంద్రబాబు పాత్ర ఇది అంటూ వివరించే ప్రయత్నం వైసీపీ నుంచి జరగడం లేదు. ఎంతసేపు సిఐడి చీఫ్ సంజయ్, ఏసీబీ ప్రభుత్వ న్యాయవాది సుధాకర్ రెడ్డి తో ప్రెస్ మీట్ లు, టీవీ డిబేట్లతో కాలం గడుపుతూ వస్తున్నారు. దీంతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న ఆరోపణ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత వైసిపి ఒక రకమైన ఆనందంతో గడిపింది కానీ.. రాజకీయంగా మాత్రం నష్టపోయే పరిస్థితి కొని తెచ్చుకుంది.

ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషంట్ ఇజ్ డెడ్ అన్నట్టుంది వైసీపీ పరిస్థితి. ఏపీ రాజకీయ చరిత్రలో చంద్రబాబును టచ్ చేసే నేతలు లేరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. జగన్ అరెస్టు చేయించ గలిగారు. రిమాండ్ లో పెట్టగలిగారు. రోజుల తరబడి చంద్రబాబును జైల్లో ఉంచేలా చేశారు. అయితే దీనినే విజయంగా వైసిపి సంబరాలు చేసుకుంటోంది. ప్రజాక్షేత్రంలో మాత్రం రాజకీయంగా దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబును అరెస్టు చేయడం కరెక్టేనని.. కానీ అరెస్టు చేసిన తీరే సరికాదు అంటూ రాజకీయాలతో సంబంధం లేని వారు, తటస్తులు చెబుతుండడం విశేషం. కచ్చితంగా ఇది వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించే విషయమే.అయితే దానిని మానసికంగా ఒప్పుకునేందుకు వైసిపి శ్రేణులు సిద్ధంగా లేవు.