
Cricket Players: క్రికెట్లో వింతలు చోటుచేసుకోవడం మామూలే. ఆటగాళ్లపై ఆరోపణలు రావడం సహజమే. టీ 20 ప్రపంచ కప్ లో అపజయాలు మూటగట్టుకుని అప్రదిష్ట పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యాపై సంచలన ఆరోపణ వచ్చింది. అతడితో పాటు మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్, బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లా మరికొందరు ప్రముఖులు తనపై అత్యాచారం చేశారని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నునూ ఆరోపణలు చేసింది. వీరిపై శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
తన భర్త రియాజ్ తన ప్రయోజనాల కోసం తనను పలువురు సెలబ్రిటీల దగ్గరకు పంపేవాడని తెలిపింది. ఇందులో భాగంగానే తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఫిర్యాదును రెండు నెలల క్రితమే పోలీసులకు అందజేసినా వారు పట్టించుకోలేదని పేర్కొంది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఆలస్యం జరిగిందని చెప్పింది.
ఈ ఘటనపై ముంబయి డిప్యూటీ కమిషనర్ ఆప్ పోలీస్ మంజునాథ సింగే స్పందించారు. రెహ్నుమా ఫిర్యాదు చేసింది నిజమేనన్నారు. అయితే ఫిర్యాదు చిరునామా సరిగా లేదన్నారు. అందుకే ఇన్ని రోజులు చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై స్పష్టత వచ్చాకే కేసు నమోదు చేస్తామని చూశామన్నారు. రెహ్నుమా చేసిన ఫిర్యాదు కాపీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. రెహ్నుమా చేసిన ఫిర్యాదుతో క్రికెటర్లపై అప్రదిష్ట నింద పడింది. క్రికెటర్లతో పాటు పలువురు పార్టీల నాయకుల పేర్లు అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై లోతుగా అధ్యయనం చేసేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. క్రికెటర్లపై వచ్చిన పుకార్లపై నిజానిజాలు గ్రహించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: జారవిడిచిన క్యాచ్.. చేజారిన మ్యాచ్.. అలీపై ఆగ్రహ జ్వాలలు