Gautam Gambhir: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వెళ్లాలని భావిస్తున్న టీమ్ ఇండియాకు న్యూజిలాండ్ జట్టుతో ఎదురైన ఓటమి కోలుకోలేని షాక్ ఇచ్చింది. స్వదేశంలో టీమిండియాకు తిరుగులేదని భావిస్తున్న తరుణంలో.. న్యూజిలాండ్ జట్టుతో ఎదురైన పరాజయం పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. భారత్ సిరీస్ ఓడిపోయిన నేపథ్యంలో వేళ్ళు మొత్తం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్లకు ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ నుంచి ఇచ్చే మినహాయింపును పూర్తిగా రద్దు చేశారు. టీమిండియాలో ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ అనేది ఎప్పటినుంచో ఉంది. ఒక సిరీస్ కు ముందు జట్టు సిద్ధమయ్యేందుకు ఆటగాళ్లకు ట్రైనింగ్ నిర్వహిస్తుంటారు. అయితే ఇది విరాట్, రోహిత్, బుమ్రా కు ఆప్షనల్ గా మాత్రమే ఉండేది. అయితే ఆ సమయంలో మీరు గాయపడితే జట్టుకు తీవ్రమైన నష్టం ఏర్పడుతుందని మేనేజ్మెంట్ భావించి.. వారికి మినహాయింపు ఇచ్చేది. అయితే న్యూజిలాండ్ జట్టుతో ఎదురైన ఓటమి నేపథ్యంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ గౌతమ్ కంపెనీ నుంచి మొదలు పెడితే కెప్టెన్ రోహిత్ శర్మ వరకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు జట్టు ఇలాంటి ఓటమి ఎదుర్కోవడం మేనేజ్మెంట్ ను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కోచ్ గౌతమ్ గంభీర్ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు. వాటిని ఆల్రెడీ అమలులో పెట్టారు కూడా..
నవంబర్ 1 నుంచి మూడో టెస్ట్
ముంబై వేదికగా నవంబర్ ఒకటి నుంచి మూడవ టెస్ట్ మొదలుకానుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి.. పరువు కాపాడుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఈ విజయం జట్టులో సానుకూల సంకేతాలను కలిగిస్తున్నదని అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ ను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అది జట్టులో సమూల మార్పులకు నాంది పలుకుతుందని మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ట్రైనింగ్ క్యాంపు ను అక్టోబర్ 30 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. దీనికి ప్రతి ఒక్క ఆటగాడు హాజరుకావాలని మేనేజ్మెంట్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. సో ఈ లెక్కన జట్టులో సీనియర్, జూనియర్ అనే అంతరాలు ఉండవని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే జట్టులో అనేక మార్పులకు గౌతమ్ గంభీర్ శ్రీకారం చుడుతున్నారు. మరి ఇవి ఏ మేరకు టీమిండియా కు విజయాన్ని అందిస్తాయో చూడాల్సి ఉంది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Coach gautam gambhir is implementing new plans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com