Hardik Pandya Vs Tilak Varma: వరుస ఓటములతో పరువు మొత్తం పోగొట్టుకొని.. ప్లే ఆఫ్ నుంచి దాదాపు నిష్క్రమించిన ముంబై జట్టు.. ఆటో తీరుతోనే కాదు.. ఆటగాళ్ల ప్రవర్తన తీరుతోనూ అభాసుపాలవుతోంది. ముంబై జట్టు చెందిన కీలక ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ పడడం సంచలనానికి దారితీసింది. ముంబై జట్టుకు ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరో ఆటగాడు తిలక్ వర్మ ఆ జట్టులో అత్యంత కీలకంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యాకు, తిలక్ వర్మకు మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ డ్రెస్సింగ్ రూమ్ కూడా షేర్ చేసుకున్నారు. వీరిద్దరూ భారత క్రికెట్ జాతీయ జట్టులో కలిసి ఆడారు. అయితే అలాంటి ఆటగాళ్లు గొడవ పడడం చర్చకు దారి తీస్తోంది.
ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మధ్య గొడవ జరిగిందని సమాచారం. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ ఆడిన తీరు పట్ల హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో అందరి ముందే అతడు తిలక్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశాడని ప్రచారం జరుగుతోంది. దీనికి తిలక్ వర్మ కూడా గట్టి రిప్లై ఇచ్చాడని సమాచారం. ఇద్దరి మధ్య మాటలు పెరిగి బాహాబాహికి దిగారని తెలుస్తోంది.
వివాదం మరింత ముదిరే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్యలో ఎంట్రీ ఇచ్చాడట. అటు తిలక్ వర్మ, ఇటు హార్దిక్ పాండ్యాతో చర్చలు జరిపి, గొడవను సద్దుమణిగించాడట. ఢిల్లీ జట్టుపై ముంబై ఓడిపోయిన తర్వాత.. తిలక్ వర్మ ఆట తీరుపై హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలే ఈ గొడవకు కారణమట. వాస్తవానికి ఏ జట్టు కెప్టెన్ అయినా.. ఆటగాడు సరిగ్గా ఆడక పోతే అతడితో వ్యక్తిగతంగా చర్చించాలి. లేదా కోచ్ ముందు మాట్లాడాలి. డ్రెస్సింగ్ రూమ్ లో అందరి ముందు అలా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇంతవరకూ చూడలేదని సీనియర్ ఆటగాళ్లు అంటున్నారు. అంతేకాదు తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి ఏకంగా పోస్ట్ మ్యాచ్ ప్రదేశం లో హార్దిక్ అసహనం వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్లో దూకుడుగా ఆడకుండా, సింగల్స్ తీశాడని.. అందువల్లే మ్యాచ్ ఓడిపోయామని హార్దిక్ పాండ్యా అనడం తిలక్ వర్మకు ఇబ్బంది కలగజేసింది. ఈ ఉదంతం ముంబై జట్టులో ఉన్న లొసుగులను మరోసారి బట్టబయలు చేసింది.