IND vs PAK : 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా – పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. నాటి ఓటమితో టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు నాడు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా సర్ఫరాజ్ వ్యవహరించాడు. నాడు అతడి ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ విజేతగా నిలవడంతో.. అతడు ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఇప్పటికీ పాకిస్తాన్ లో అతడు సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నాడు. 2017 తర్వాత ఇప్పటిదాకా ఛాంపియన్స్ ట్రోఫీ మరొకసారి జరగలేదు. అయితే 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో సర్ఫరాజ్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో.. ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో అతడి గురించే చర్చ జరుగుతోంది. ” సర్ఫరాజ్ అద్భుతంగా ఆడాడు.. జట్టను గొప్పగా ముందుకు నడిపించాడు. కానీ ఇప్పుడు ఆ చొరవ ప్రస్తుత జట్టు కెప్టెన్ రిజ్వాన్ చూపించడం లేదని” పాకిస్తాన్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. న్యూజిలాండ్ జట్టు చేతుల్లో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టును ఏకి పారేశారు.
సెలబ్రిటీలు హాజరయ్యారు
అబుదాబి వేదికగా పాకిస్తాన్ – భారత్ తలపడుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు జట్లు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ఏపీ మంత్రి నారా లోకేష్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టీమిండియా టి20 ఆటగాళ్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ మ్యాచ్ వీక్షించడానికి వెళ్లారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను భారత జెర్సీలో కుమారుడితో కలిసి మంత్రి నారా లోకేష్ వీక్షించారు. నారా లోకేష్ మ్యాచ్ వీక్షిస్తున్న ఆ ఫోటోలను టిడిపి నాయకులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షాతో సమావేశమై, రాష్ట్రంలో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు.
ఇక టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కూడా పాక్ – భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను చూశారు. కాకపోతే వారు దుబాయిలో కాకుండా.. మనదేశంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ లో వీక్షించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Chiranjeevi in IND VS PAK Match
సెలబ్రిటీలు కూడా టీమిండియా – పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను చూసేందుకు ఆసక్తిని ప్రదర్శించడం విశేషం. భారత్ – పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరైన నేపథ్యంలో.. అతడి అభిమానులు కేరింతలు కొడుతున్నారు.. కామెంట్రీ బాక్స్ లో చిరంజీవి పేరు వినిపించగానే ఎగిరి గంతులేశారు. ఒక రకంగా పాకిస్తాన్ – భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో చిరంజీవి సెంట్ర ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
MEGASTAR CHIRANJEEVI IN THE STANDS FOR INDIA VS PAKISTAN. pic.twitter.com/qKFa3RbgjG
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
ABHISHEK SHARMA AND TILAK VARMA AT THE DUBAI STADIUM. pic.twitter.com/kylxPBxC8L
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
MS DHONI AND SUNNY DEOL WATCHING INDIA VS PAKISTAN. pic.twitter.com/bgtGROZ5ZD
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Chiranjeevi as the center of attraction in the india pakistan match
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com