Hardik Pandya: ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించడం పట్ల పలు రకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. ఇండియన్ టీం కి చెందిన మాజీ ప్లేయర్లు సైతం తమదైన రీతిలో రకరకాలుగా స్పందిస్తున్నారు.అయితే ఈ విషయం మీద మాజీ ప్లేయర్ అయిన ఆకాష్ చోప్రా తనదైన రీతిలో స్పందించాడు…
హార్దిక్ పాండ్య గుజరాత్ టైటాన్స్ టీమ్ ని రెండుసార్లు ఫైనల్ కి చేర్చాడు. అందులో ఒకసారి ట్రోఫీని అందించగా, మరొకసారి ఫైనల్ లో రన్నరప్ గా నిలిపాడు.ఇక ఈ టీం అద్భుతమైన ప్రదర్శన కనబరచడం పట్ల అతని గొప్ప కెప్టెన్సీ ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలలో తేలిపోయినట్టుగా కనిపిస్తుంది.గుజరాత్ ఆడిన మ్యాచ్ లను చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. నిజానికి హార్థిక్ పాండ్య తగిన రీతిలో కెప్టెన్సీ చేయడానికి కోచ్ ఆశిష్ నెహ్ర తన సహకారాన్ని అందించాడు.ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తు హార్థిక్ పాండ్య తో గ్రౌండ్ లో డిస్కస్ చేసుకోవడం అనేది మనం చాలా మ్యాచుల్లో చూశాం. అయితే ముంబై ఇండియన్స్ టీమ్ తనకి కెప్టెన్సీ ఇస్తుందనే ఉద్దేశ్యం తోనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టీమ్ ని వదిలేసి ముంబై ఇండియన్స్ టీం లోకి వచ్చాడు అనేది వాస్తవం.
అయితే ఈ విషయం రోహిత్ శర్మ కి కూడా ముందుగానే తెలుసు అని కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదుసార్లు ముంబై ఇండియన్స్ టీం కి ట్రోఫీని అందించిన కెప్టెన్ కి చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఏ యాజమాన్యం తీసుకోలేదు ఈ విషయాన్ని ముందుగా రోహిత్ తో డిస్కస్ చేసిన తర్వాతనే హార్దిక్ ని టీమ్ లోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటిదాకా గుజరాత్ టైటాన్స్ టీం వైపు హార్ధిక్ చేసిన కెప్టెన్సీ వేరు ఇప్పుడు 2024 లో ముంబై ఇండియన్స్ టీం వైపు అతను చేసే కెప్టెన్సీ వేరు ఈ సంవత్సరం కనక తనని ప్రూవ్ చేసుకోగలిగితే ఆయన కెప్టెన్ గా మంచి మార్కులను అందుకుంటాడు. నిజానికి హార్థిక్ పాండ్య మంచి కెప్టెన్ గా ఎదగాలంటే ఆయన కొన్ని విషయాలని మార్చుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్లేయర్లని ఎప్పటికప్పుడు మోటివెట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే తత్వాన్ని అలవర్చుకోవాలి అలాకాకుండా వాళ్ళని దూషిస్తూ గ్రౌండ్ లో ఇబ్బంది పెట్టకూడదు.
అలాగే ఒక మ్యాచ్ ని దూర దృష్టి తో అంచనా వేయగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. అలాంటి విషయాలలో ఆయన కనక కొంచెం ఇంట్రెస్ట్ చూపించినట్టయితే తను కూడా మంచి కెప్టెన్ గా ఎదుగుతాడు అని అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు…నిజానికి హార్దిక్ పాండ్యలో నాయకత్వపు లక్షణాలు ఉన్నప్పటికీ తను కొన్నిసార్లు ప్రవర్తించిన తీరును బట్టి చూస్తే మరి సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి. వీటన్నింటిని తను మార్చుకోగలిగితేనే తను మంచి నాయకుడిగా ఎదుగుతాడు లేకపోతే మాత్రం కెప్టెన్ గా దారుణంగా ఫెలవుతాడు అని అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు…