Buzzballz England Cricket: బజ్ బాల్.. ఇంగ్లాండుకు బలమా..? బలహీనతా..?

బజ్ బాల్.. ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో అనుసరిస్తున్న విధానం. ఈ విధానంలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు దూకుడుతో కూడిన ఆటను ఆడుతుంది. వికెట్లు పడుతున్న ఆట తీరు మాత్రం మాత్రం మారదు. వేగంగా ఆడడం ద్వారా ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచి విజయం సాధించడమే ఈ విధానము యొక్క అంతిమ లక్ష్యం. ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.

Written By: BS, Updated On : July 11, 2023 1:16 pm
Follow us on

Buzzballz England Cricket: ఇంగ్లాండ్ జట్టు గత కొన్నాళ్లుగా బజ్ బాల్ మంత్రాన్ని జపిస్తోంది. ఈ వ్యూహాన్ని అమలు చేస్తూ టెస్టుల్లో విజయాలు నమోదు చేస్తోంది ఇంగ్లాండ్ జట్టు. యాషెస్ సిరీస్ ముందు వరకు ఈ వ్యూహం ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఫలితాలను ఇచ్చింది. అయితే , అనూహ్యంగా యాషెస్ సిరీస్ లో మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని రీతిలో ఓటములు ఎదురయ్యాయి. మొదటి రెండు టెస్టుల్లో దారుణంగా పడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ వ్యూహంపై విమర్శలు వెల్లువెత్తాయి.

బజ్ బాల్.. ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో అనుసరిస్తున్న విధానం. ఈ విధానంలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు దూకుడుతో కూడిన ఆటను ఆడుతుంది. వికెట్లు పడుతున్న ఆట తీరు మాత్రం మాత్రం మారదు. వేగంగా ఆడడం ద్వారా ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచి విజయం సాధించడమే ఈ విధానము యొక్క అంతిమ లక్ష్యం. ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అయితే గతంలో మాదిరిగా సానుకూల ఫలితాలు మాత్రం రావడం లేదు. ఇంగ్లాండ్ అనుసరిస్తున్న విధానానికి పోటీగా అన్నట్లు ఆస్ట్రేలియా జట్టు కూడా ఆడుతూ చెక్ పెట్టింది. దీంతో బజ్ బాల్ వ్యూహం ఇంగ్లాండుకు యాషెస్ సిరీస్ లో బెడిసికొట్టినట్టు అయింది.

బజ్ బాల్ పై సాగుతున్న చర్చ..

వరుస రెండు టెస్టుల్లో ఓటమిపాలైన తర్వాత ఇంగ్లాండ్ జట్టు అనుసరిస్తున్న బజ్ బాల్ వ్యూహంపై విమర్శలు వచ్చాయి. అన్నివేళలా వేగంగా ఆడడం ద్వారా సానుకూల ఫలితాలను రాబట్టలేమని క్రికెట్ విశ్లేషకులు విమర్శించారు. అయితే ఇంగ్లాండ్ జట్టు కోచ్, కెప్టెన్ సహా ఆటగాళ్లంతా.. తమ వ్యూహాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే, బజ్ బాల్ వ్యూహం లాభమా..? నష్టమా..? అన్న దానిపై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. టెస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆడడం వల్ల ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచవచ్చు. కానీ బౌలర్లు చెలరేగుతున్న వేళ ఆచితూచి ఆడడం ద్వారా జట్టు ఇబ్బందుల్లోకి వెళ్ళకుండా కాపాడుకునే అవకాశం లభిస్తుంది. ఒకవైపు వికెట్లు పడుతున్న.. మరోవైపు వేగంగా ఆడే ప్రయత్నం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు ఈ తరహా విధానం సానుకూల ఫలితాలను ఇవ్వదని స్పష్టం చేస్తున్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడం ద్వారా మాత్రమే పటిష్టమైన జట్లను ఓడించేందుకు అవకాశం ఉంది. పటిష్టమైన జట్లపై ఎదురుదాడికి దిగడం అన్నివేళలా మెరుగైన ఫలితాలను ఇవ్వదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలమైన జట్లతో ఆడేటప్పుడు బజ్ బాల్ వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం నష్టపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, గెలుపోవటములతో సంబంధం లేకుండా తమ ఆట తీరును కొనసాగిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ స్పష్టం చేశాడు. ఇకపై తాము సరికొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని, మిగిలిన టెస్టుల్లోనూ తమ శైలి కొనసాగిస్తామని స్టోక్స్ స్పష్టం చేశాడు. లార్డ్స్ టెస్ట్ కు ముందైనా, మూడో టెస్టులో అయినా, తర్వాతి టెస్టులో ఆయన అటతీరు ఒకే రకంగా ఉంటుందని, ఇలా ఆడడం ద్వారా ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశాడు.