Butler : ఇంగ్లాండ్ జట్టుకు వన్డే, టి20 ఫార్మాట్ లలో కెప్టెన్ గా బట్లర్ కొనసాగుతున్నాడు. అతని ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ జట్టు ఇటీవల పాకిస్తాన్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైంది. ఇటీవల పాకిస్తాన్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా పై జరిగిన మ్యాచ్లో 351 పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఇంగ్లాండ్ జట్టు విఫలమైంది. తద్వారా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 325 పరుగులు చేయగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ 317 పరుగులు చేసింది. మొత్తంగా 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 179 పరుగులకే కుప్ప కూలింది. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. మొత్తంగా ఆడిన మూడు మ్యాచ్లలో ఓడిపోయి ఇంగ్లాండ్ జట్టు అత్యంత దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
నాటినుంచి..
తన సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించడంతో.. కొద్దిరోజులుగా బట్లర్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న బట్లర్.. తన నిర్ణయాన్ని ఇంగ్లాండు క్రికెట్ బోర్డు కు సోమవారం వెల్లడించాడు. ” నా సారధ్యంలో ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో విఫల ప్రదర్శన చేసింది. ఇది ఒక ఆటగాడిగా ఎంతో ఇబ్బంది కలిగిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును అత్యంత విజయవంతంగా ముందుకు నడిపించే సామర్థ్యం నాకు లేనట్టుగా అనిపిస్తోంది. అందువల్లే జట్టు బాధ్యతలు బ్రూక్ కు అప్పగించండి అంటూ” అతడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు విన్నవించాడు. బట్లర్ నిర్ణయాన్ని గౌరవించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బ్రూక్ ను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బట్లర్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. ఇదే విషయాన్ని మెయిల్ ద్వారా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు తెలియజేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టు.. భారతదేశంలో పర్యటించింది. వన్డే, టి20 సిరీస్ లు ఆడింది. అటు వన్డే, ఇటు టి20 సిరీస్ లను కోల్పోయింది. 2024 ప్రారంభంలో భారత జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఒక్క టెస్ట్ మాత్రమే గెలిచింది. మిగతా అన్నింటిలో ఓటమిపాలైంది.
Also Read : MI బౌలర్ బౌల్ట్ అరుదైన ఘనత.. మరెవరికీ సాధ్యం కాదేమో..