IND VS BAN Test Match : కాన్పూర్ లో రెచ్చిపోయిన బుమ్రా.. బెంబేలెత్తిన బంగ్లా.. రెండవ టెస్టు పరిస్థితి ఏంటంటే?

వర్షం మూడు రోజులు ఇబ్బంది పెట్టినప్పటికీ.. భారత జట్టు కాన్పూర్ వేదికగా జరుగుతున్న టెస్టులో బంగ్లా జట్టును బెంబేలెత్తించింది.. ముఖ్యంగా పేసుగుర్రం బుమ్రా రెచ్చిపోయాడు. సోమవారం గ్రీన్ పార్క్ మైదానంపై బంతితో తాండవం చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 30, 2024 2:16 pm

IND VS BAN Test Match

Follow us on

IND VS BAN Test Match :  రెండవ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టు 23 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. మోమినుల్ హక్ 107* పరుగులతో కదం తొక్కాడు. కెప్టెన్ నజ్ముల్ షాంటో 31 పరుగులతో రెండవ టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. రెండో టెస్టులో గెలవాలని టీమ్ ఇండియా భావించినప్పటికీ.. వరుణుడు పదేపదే ఆటంకం కలిగించాడు. రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 35 ఓవర్ల పాటే ఆటసాగింది. ఇలా రెండవ రోజు, మూడవరోజు బంతి పడకుండానే మ్యాచ్ రద్దయింది. సోమవారం వాతావరణం తెరిపి ఇవ్వడంతో మ్యాచ్ కొనసాగించారు. 107/3 తో సోమవారం తొలి ఇన్నింగ్స్ పున: ప్రారంభించిన బంగ్లాదేశ్ చివరి ఏడు వికెట్లను మరో 126 పరుగులు చేసి కోల్పోయింది.. సోమవారం తొలి సెషన్ లో బంగ్లా జట్టు 31 ఓవర్లు ఎదుర్కొంది. 98 పరుగులు చేసింది. ఈ క్రమంలో మూడు వికెట్లు నష్టపోయింది. భారత బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫీల్డర్లు కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది.

అద్భుతమైన ఫీల్డింగ్ తో..

సోమవారం ఆట మొదలైన కొంతసేపటికే బుమ్రా అద్భుతమైన బంతికి ముష్ఫికర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన బంతిని అతడు అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా త్వరగానే వికెట్ కోల్పోయాడు. అనంతరం సిరాజ్ బంతిని అందుకున్నాడు. తను కూడా వికెట్ల వేట మొదలుపెట్టాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతిని ఆడ లేక దాస్ తడపడ్డాడు. స్లిప్ లో రోహిత్ శర్మ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ కు అవుట్ అయ్యాడు. రోహిత్ గాల్లోకి అమాంతం ఎగిరి ఒంటి చేత్తో క్యాష్ పట్టాడు. ఇదే సమయంలో మహమ్మద్ సిరాజ్ కూడా కళ్ళు చెదిరే ఫీల్డింగ్ చేయడంతో షకీబ్ అల్ హసన్ పెవిలియన్ చేరుకున్నాడు. అశ్విన్ బౌలింగ్లో షకిబ్ ముందుకు వచ్చి ఆడాడు. అయితే సిరాజ్ వెనక్కి పరుగులు తీస్తూ.. అమాంతం గాల్లోకి డైవ్ చేసి ఎడమ చేతితో బంతిని అందుకున్నాడు. మరోవైపు బంగ్లా ఆటగాడు మోమినుల్ జాగ్రత్తగా ఆడాడు. ఏకంగా సెంచరీ చేశాడు. ఇక రెండవ సెషన్ లో బుమ్రా తన దూకుడు కొనసాగించాడు. బంగ్లాదేశ్ జట్టుకు చుక్కలు చూపించాడు. మోహదీ హసన్(20), టైజుల్ ఇస్లాం (5) ను వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. ఇక చివరి రెండు వికెట్లను సిరాజ్, జడేజా పడగొట్టారు. ఫలితంగా బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయింది. కాగా, తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత జట్టు కడపటి వార్తలు అందే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 11 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ సహాయంతో 23 పరుగులు చేశాడు. ఇదే సమయంలో దూకుడుగా ఆడబోయి మోమినుల్ బౌలింగ్ లో క్లీన్ బౌడ్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 48, గిల్ 3 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు