Homeక్రీడలుBrydon Carse: క్రికెటర్ కాస్త బెట్టింగ్ బంగార్రాజు అయ్యాడు.. ఒళ్ళు మండిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

Brydon Carse: క్రికెటర్ కాస్త బెట్టింగ్ బంగార్రాజు అయ్యాడు.. ఒళ్ళు మండిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన్ని తరిమేసింది

Brydon Carse:: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ధన ప్రవాహం అధికంగా ఉండే గేమ్. కొన్నేళ్ల నుంచి ఈ ఆటలోకి కార్పొరేట్ వ్యక్తులు కూడా ప్రవేశిస్తున్నారు. ఫలితంగా ఈ ఆట వందల కోట్ల నుంచి వేల కోట్ల దాకా ఎదిగిపోయింది. ఐపీఎల్ వల్ల క్యాష్ రీచ్ లీగ్ లకు ప్రాధాన్యం ఏర్పడింది.. ఇదే సమయంలో కొంతమంది ఆటగాళ్లకు డబ్బు మీద విపరీతమైన పిచ్చి ఏర్పడింది. ఆట ద్వారా సంపాదించుకోవడం మానేసి, అడ్డదారుల్లో వెనకేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఒక క్రికెటర్ అడ్డంగా దొరికిపోయాడు. చివరికి నిషేధం ఎదుర్కొన్నాడు. టి20 వరల్డ్ కప్ ముందు పరువు పోగొట్టుకొని దోషి లా నిలబడ్డాడు.

కొంతకాలంగా క్రికెట్లో దూకుడుకు సిసలైన పర్యాయపదంలా నిలిచిన ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో ఓ బెట్టింగ్ బంగార్రాజు అసలు ముఖచిత్రం బయటపడింది. క్రికెట్ ఆడురా నాయన అంటే.. దాన్ని పక్కనపెట్టి బెట్టింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఇది కాస్త ఇంగ్లాండు క్రికెట్ బోర్డుకి తెలియడంతో తన్ని తరిమేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు చెందిన బ్రైడన్ కార్స్ అనే ఆటగాడు క్రికెట్ ఆడటం పక్కన పెట్టి బెట్టింగ్ కు పాల్పడుతున్నాడు. దీంతో అతనిపై ఇంగ్లాండు క్రికెట్ బోర్డు మూడు నెలల పాటు నిషేధం విధించింది. కార్స్ 2017 నుంచి 2019 వరకు 303 బెట్టింగ్ లకు పాల్పడ్డాడు. పూర్తి ఆధారాలతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతడి వ్యవహారాన్ని బయట పెట్టడంతో తలవంచాడు. తప్పు ఒప్పుకున్నాడు. ఫలితంగా వచ్చే మూడు నెలలపాటు అంటే మే 28 నుంచి ఆగస్టు 28 వరకు అతడు ఎలాంటి క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉండదు. కార్సే బెట్టింగ్ లకు పాల్పడిన ఏ క్రికెట్ మ్యాచ్ లోనూ ఆడలేదు.. నిషేధం వల్ల కార్సే వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండడు. శ్రీలంక లో పర్యటించే సమయానికి అతనిపై నిషేధం ముగుస్తుంది..” మేము చాలా విషయాలను పరిశీలనలోకి తీసుకున్నాం. కార్సే బెట్టింగ్ కు పాల్పడినట్టు తెలిసింది. అందువల్ల అతనిపై చర్యలు తీసుకున్న. క్రికెట్లో ఎటువంటి అవినీతి మాకు కనిపించినప్పటికీ.. వదిలి వేసే ప్రసక్తి ఉండదు.. అవినీతి చర్యలను మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని” ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

కార్సే 2021లో పాకిస్తాన్ జట్టుపై జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు తరుపున 14 వన్డేలు ఆడాడు. మూడు అంతర్జాతీయ టి20 మ్యాచ్లలో పాలుపంచుకున్నాడు. వన్డేలలో 15 వికెట్లు పడగొట్టాడు. టి20 లో నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ గా 2023 వన్డే ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ జట్టు తరుపున 15 ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకున్నాడు.. ఫాస్ట్ బౌలర్ గా ఎంతో ఖ్యాతిని ఆర్జించాల్సిన సమయంలో బెట్టింగ్ కు పాల్పడి పరువు పోగొట్టుకున్నాడు. నిషేధం అనంతరం అతడు అండర్సన్ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular