Brendon McCullum: రోహిత్ శర్మ పైన కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ ప్లేయర్…ఆయన వాల్యూ ఏంటో ప్రపంచానికి తెలుసు…

విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ కోహ్లీ స్టార్టింగ్ లో ఆడుతున్నప్పుడే ఆయన టాలెంట్ నేను గుర్తించాను ఆయన చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు అని నాకు అనిపించింది.

Written By: Gopi, Updated On : December 7, 2023 5:45 pm

Brendon McCullum

Follow us on

Brendon McCullum: వన్డే వరల్డ్ కప్ లో చాలా దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చినందుకు మన ప్లేయర్లు అందరూ చాలా బాధపడుతుంటే ప్రపంచ దేశాలు సైతం ఇండియన్ ప్లేయర్లని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇప్పటికే బ్రియాన్ లారా లాంటి దిగ్గజ క్రికెటర్ తన రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఇండియన్ ప్లేయర్ అయిన ఒక్క శుభ్ మన్ గిల్ కి మాత్రమే ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించగా, ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్ కి హెడ్ కోచ్ గా ఉన్న బ్రెండన్ మెక్ కలమ్ సైతం ఇండియన్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల మీద ప్రశంసల వర్షం కురిపించాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నోవేషన్ ల్యాబ్ లీడర్స్ మీట్ లో పాల్గొన్న ఆయన రోహిత్ శర్మని ఉద్దేశిస్తూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటి అంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆయన తీసుకునే డిసీజన్స్ చాలా అగ్రేసివ్ గా ఉండటమే కాకుండా అవి టీమ్ ని గెలిపించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఇండియన్ టీం కి రోహిత్ శర్మ లాంటి ఒక కెప్టెన్ దొరకడం నిజంగా ఇండియన్ టీమ్ అదృష్టం అంటూ రోహిత్ శర్మ పైన కీలకమైన వ్యాఖ్యలు చేశాడు…

ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ కోహ్లీ స్టార్టింగ్ లో ఆడుతున్నప్పుడే ఆయన టాలెంట్ నేను గుర్తించాను ఆయన చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు అని నాకు అనిపించింది. ఇక ఇప్పుడు తను ప్రపంచంలోని అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ గా ఎదిగాడు అంటూ కోహ్లీ గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడాడు…ఇక ఇంగ్లాండ్ తో ఇండియా టెస్ట్ సీరీస్ ఆడబోతుంది దాని మీద మాట్లాడుతూ ఇండియాని ఎదుర్కోవాలంటే కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన ప్రపంచంలో అత్యున్నతమైన టీముల్లో ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే మేము కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఇటు ఇండియా ని అటు ప్లేయర్లని పొగుడుతూ మెక్ కలమ్ మాట్లాడడం ప్రతి క్రికెట్ అభిమాని ని కూడా చాలా ఆనంద పడేలా చేసింది.

ఇక అన్ని వేళలా బజ్ బాల్ గేమ్ అనేది వర్క్ ఔట్ అవ్వదు.మొదటి నుంచి బజ్ బాల్ గేమ్ అనేది ఇంగ్లాండ్ టీం కి బాగా కలిసొస్తుందని చెబుతూనే ఇండియన్ టీం మీద కూడా ఆ బజ్ బాల్ గేమ్ ఆడాలంటే చాలా కష్టం కానీ ఇండియన్ టీమ్ ని ఎదుర్కోవడానికి మేము చాలా రకాల ప్రణాళికలను చేసుకుంటున్నాం అంటూ తను చెప్పుకొచ్చాడు…