IPL: ప్రపంచంలో ఏ లీగ్ కు లేని విలువ వాల్యూ ఐపిఎల్ కి ఉంది. అందుకే ఐపిఎల్ ని ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అత్యంత విలువైన లీగ్ గా చూస్తున్నారు. ప్రతి ఒక్క దేశానికి చెందిన ప్లేయర్ కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా ఐపిఎల్ లో ఆడాలి అని కోరుకుంటున్నారు అంటే ఐపిఎల్ స్టాండర్డ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన గ్లెన్ మాక్స్ వెల్ సైతం తను ఐపిఎల్ ఆడటం వల్లనే చాలా నేర్చుకున్నాను అంటూ తను ఇంత పర్ఫెక్ట్ గా బ్యాటింగ్ చేయడానికి కూడా ఐపీఎల్ చాలా హెల్ప్ చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు…
ఇక ఇది ఇలా ఉంటే ఐపిఎల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.అది ఏంటంటే 10 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఐపీఎల్ బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపు రూ.83,353 కోట్లు గా ఉంది. 2022 లో 8.4 బిలియన్ డాలర్లు తో పోలిస్తే ఆ విలువ ఇప్పుడు 28 శాతం పెరిగింది. ఇక మొదట ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరం 2008తో పోల్చుకుంటే 433 శాతం పెరిగింది. ఇది ఎవరో ఇచ్చింది కాదు బ్రాండ్ విలువను లెక్కగట్టే సంస్థ బ్రాండ్ ఫినాన్స్‌రివీల్స్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది.
మీడియా హక్కుల కింద 6.2 బిలియన్ డాలర్లు వస్తున్నాయి అంటే ఇండియన్ రూపిస్ లో 48,390 కోట్లు వస్తుంది.ఇక గత రెండు సంవత్సరాల క్రితం రెండు ఫ్రాంఛైజీలు కొత్తగా చేరడం ఒకటైతే అంతకు ముందు కోవిడ్ భయం తో ఎవరు స్టేడియం లకి రాలేదు కానీ 2023 లో కొవిడ్ తర్వాత స్టేడియాలు పూర్తిగా నిండటం ఇలాంటి వివిధ కారణాల వల్ల ఐపిఎల్ బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఇక ఫ్రాంఛైజీల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ 87 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.725 కోట్లు వరకు పెరిగింది, ఇక ధోనీ సారథ్యం లో ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా ఇప్పటికీ 5 సార్లు టైటిల్ గెలుచుకుంది దాంతో ఈ టీమ్ బ్రాండ్ వాల్యూ కూడా భారీ గా పెరిగింది.
ముఖ్యంగా 2023 లో కూడా చాంపియన్స్ గా నిలవడం తో చెన్నై బ్రాండ్ వాల్యూ 81 మిలియన్ డాలర్లు అంటే రూ.675 కోట్లు,ఇక ఐపిఎల్ లో మరో టీమ్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 78.6 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.655 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 69.8 మిలియన్ డాలర్లు మన రూపిస్ లో రూ.581 కోట్లు సాధించి ఈ నాలుగు టీమ్ లు కూడా బ్రాండ్ వాల్యూ నీ బాగా పెంచుకొని ఐపిఎల్ లో బ్రాండ్ వాల్యూ ఎక్కువ గా ఉన్న టీమ్ లలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి…