Photo Story: భారత క్రికెట్లో ఆటగాళ్ల ఫర్ఫామెన్స్ ఎవరికి వారే అన్నట్లుగా తమ దూకుడును ప్రదర్శిస్తారు. అయితే ఒకరి కోసం మరొకరను అన్నట్లుగా కొందరు క్రీడాకారుల మధ్య మంచి స్నేహం ఉంటుంది. అలనాడు గంగూలీ-ద్రావిడ్.. ఆ తరువాత సచిన్-సెహ్వాలు సూపర్ జోడీ అని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడున్న వాళ్లల్లో విరాట్ కోహ్లి- రవీంద్ర జడేజాలా మధ్య మంచి మితృత్వం ఉందని తెలుస్తోంది. కొన్ని సార్లు వీరు కలిసి చేసే విన్యాసాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఒకసారి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బాల్ కోసం పోటీ పడి మరీ ఇద్దరూ కలిసి రన్నింగ్ చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. లేటేస్టుగా వీరిద్దరు చిన్నప్పడు కలిసి ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కెప్టెన్ గా విరాట్ కోహ్లి విశేష గుర్తింపు పొందాడు. అయితే ఒక్కోసారి రవీంద్ర జడేజా కోహ్లిని ఉద్దేశించి ఆసక్తి కర కామెంట్స్ చేసేవారు. కెప్టెన్సీ ధోనీ లేకపోతే కోహ్లి ఆట తీరు మెరుగుపడదని అనడం ఆశ్చర్యమేసింది. అయితే కోహ్లిపై ఉన్న అభిమానంతోనే జడేజా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని క్రీడాలోకంలో చర్చ సాగుతోంది. అయితే అంతకుముందు ధోనీ బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న జడేజా ఆ తరువాత కోహ్లితో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. వీరిద్దరు కలిసి మైదానంలో ఉన్నారంటే ఫన్నీ మూమెంట్స్ ఉంటాయని కొందరు అభిమానులు అనుకుంటూ ఉంటారు.
ఇక తాజాగా వీరికి సంబంధించి ఓ పిక్ వైరల్ అవుతోంది. అందులో జడేజా యంగ్ వయసులో ఉన్నప్పటి ఫొటోతో పాటు కోహ్లి పిల్లాడిలా ఉన్న పిక్ అలరిస్తోంది. ఇందులో ఇద్దరు కలిసి ఉన్నట్లు ఉంది. అయితే వీరిద్దరు ఆ సమయంలో ఎప్పుడు కలిశారన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. టీమిండియాలో చేరకముందే వీరిద్దరు స్నేహితులా? అని కొందరు అనుకుంటుంటడగా.. దీనిని అలా మిక్స్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ పిక్ క్రీడాభిమానులను అలరిస్తోంది.
2011లో టీమిండియాలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లి 274 వన్డేలు, 115 టీ 20 మ్యాచ్ లు ఆడాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 12,898 పరుగులు చేయగా.. టీ20ల్లో 4,008 రన్స్ చేశారు. వన్డేల్లో బ్యాటింగ్ సగటు 57.32 కాగా.. టీ20లోనూ అంతే ఉంది. రవీంద్ర జడేజా తన కెరీర్లో 174 వన్డేలు ఆడగా.. 64 టీ 20ల్లో పాల్గొన్నాడు. 2,526 వన్డే పరుగులు చేయగా.. 457 టీ 20 రన్స్ చేశారు. రవీంద్ర బ్యాటింగ్ సగటు వన్డేల్లో 32.80 ఉండగా.. టీ 20ల్లో 24.05 గా ఉంది.