Pat Cummins: ఆస్ట్రేలియా జట్టుకు షాక్

Pat Cummins: భారత్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఇక్కడ జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్ లను ఆస్ట్రేలియా కోల్పోయింది. మూడో టెస్టులో విజయం సాధించింది. ఇక గాయాల కారణంగా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ జోష్ హెజల్ వుడ్ దూరం కాగా..తాజాగా కెప్టెన్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. దీంతో మూడో టెస్టుకు స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. తాజాగా నాలుగో టెస్టుకు కూడా అతడు […]

Written By: Chiranjeevi Appeesa, Updated On : March 6, 2023 4:07 pm
Follow us on

Pat Cummins

Pat Cummins: భారత్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఇక్కడ జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్ లను ఆస్ట్రేలియా కోల్పోయింది. మూడో టెస్టులో విజయం సాధించింది. ఇక గాయాల కారణంగా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ జోష్ హెజల్ వుడ్ దూరం కాగా..తాజాగా కెప్టెన్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. దీంతో మూడో టెస్టుకు స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. తాజాగా నాలుగో టెస్టుకు కూడా అతడు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జట్టులో కీలక సభ్యులు దూరం కావడంతో తరువాతి మ్యాచ్ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది.

Also Read: India- Turkey: విహ్వాస ఘాతుకం : అంత సాయం చేసినా కశ్మీర్‌పె విషం కక్కిన టర్కీ.. ధీటుగా బదులిచ్చిన భారత్‌!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్ పూర్ వేదికగా మొదటి టెస్ట్ సాగింది. తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగుల తేడాతో ఆసిస్ ను భారత్ ఓడించింది. రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో 2-0 తో ఆధిక్యంతో సిరీస్ ను దాదాపు దక్కించుకున్నట్లయింది. అయితే మూడో టెస్టు సమయంలో కెప్టెన్ కమిన్ స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఆయన ప్లేసులో స్టీవెన్ స్మిత్ వచ్చి అద్భుతమైన బౌలింగ్ వేశాడు. దీంతో మూడో టెస్ట్ ఆస్ట్రేలియా వశమైంది.

ఇప్పుడు నాలుగో టెస్టులో భారత్ గెలిస్తేనే భారత్ డబ్లూటీసీ ఫైనల్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆయితే కెప్టెన్ కమిన్స్ నాలుగో టెస్టుకూ దూరం కానున్నాడు. తన తల్లి ఆరోగ్యం బాగా లేనందున దగ్గర ఉండేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. మరి కొందరు గాయాల కారణంగా దూరంగా ఉన్నారు. అయితే స్మిత్ కెప్టెన్సీలో మూడో టెస్ట్ విజయం సాధించింది.ఇప్పుడు నాలుగో టెస్టు ఏం చేస్తుందోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pat Cummins

ఇదిలా ఉండగా మూడో టెస్ట్ ఇండోర్ లో నిర్వహించడంతో అక్కడున్న స్పిన్ పిచ్ భారత్ ను దెబ్బతీసిందని అంటున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ను స్మిత్ తన బౌలింగ్ తో వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత ఖవాజా, ట్రావిస్ హెడ్ స్కోరు కాస్త నెమ్మదిగా తీసుకెల్లినా మొత్తంగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. అయితే ఇప్పుడు నాలుగో టెస్ట్ గుజరాత్ లో నిర్వహించనున్నారు. దీని నిర్వహణ కోసం స్పిచ్ వివరాలు ఇంకా ఇవ్వలేదట. అయితే గతంలో ఇక్కడ నిర్వహించిన రంజీలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియాలు భారీ స్కోర్లు చేస్తారని అంటున్నారు.

Also Read:Anchor Anasuya Bharadwaj: సంపాదించిన ఆస్తులను మొత్తం అమ్మేయబోతున్న యాంకర్ అనసూయ..అతనిని నమ్మి దారుణంగా మోసపోయిందా?

Tags