
టీమిండియాలో పేసర్ గా ఉన్న జస్ ప్రీత్ బూమ్రా మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లిపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఓ సినిమా నటిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వచ్చిన వార్తలపై ఆయన సోమవారం చెక్ పెట్టారు. అయితే కొంతమంది మాత్రం ఊహాగానాలు మాత్రం నిజం చేశారు. స్పోర్ట్స్ యాంకర్ గా ఉన్న సంజనా గణేశన్ తో బూమ్రా వివాహం సోమవారం జరిగింది. అనంతరం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరికీ పెళ్లి విషయాన్ని చెప్పాడు.
‘ఈ రోజు మా జీవితంలో సంతోషకరమైన రోజు.. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు ఎంతో సంతోషిస్తున్నాం’అంటూ బూమ్రా ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో స్పోర్ట్స్ ప్రేమికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య గోవాలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తనదైన బౌలింగ్ తో టీం ఇండియా పేస్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. చాలా రోజుల తరువాత ఆయన ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ ఆడాడు. రెండో టెస్టులో విరామం తీసుకొని మళ్లీ మూడో టెస్టులో పాల్గొన్నాడు. అయితే నాలుగో టెస్టు నుంచి విరామం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే విరామం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో ఆయన ఒక్కసారిగా వివాహం చేసుకొని కనిపించాడు.