Mohammed Siraj : బాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా పేరుపొందిన ఆమె.. తాజాగా ముంబైలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకలకు సిరాజ్ హాజరయ్యారు. ఆ సందర్భంగా వారిద్దరు అత్యంత సన్నిహితంగా కనిపించారు. దీంతో జాతీయ మీడియా తన కథనాలలో వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ప్రచారం చేయడం మొదలుపెట్టింది.. అన్నట్టు సిరాజ్ అత్యంత సన్నిహితంగా ఉన్న సింగర్ పేరు జనై భోస్లే. ఈమె బాలీవుడ్ ఫేమస్ సింగర్ ఆశా భోస్లే మనవరాలు. జనై కూడా పాటలు పాడుతుంది. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్నది. ఈనెల ఆమె తన 23వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో సిరాజ్, జనై అత్యంత సన్నిహితంగా కనిపించారు. పైగా వారిద్దరూ చిరునవ్వులు చెందుకుంటూ.. చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ దర్శనమిచ్చారు. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
ఒకరినొకరు ఫాలో
జనై, సిరాజ్ సోషల్ మీడియాలో ఒకరు ఒకరు ఫాలో అవుతున్నారు. మరోవైపు జనై ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టును మాత్రమే ఫాలో అవుతోంది. వచ్చే సీజన్లో మహమ్మద్ సిరాజ్ గుజరాత్ జట్టు తర్పణ రంగంలోకి దిగనున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో గుజరాత్ జట్టు సిరాజ్ ను 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఎప్పుడైతే గుజరాత్ యాజమాన్యం సిరాజ్ ను కొనుగోలు చేసిందో.. అప్పటినుంచి జనై గుజరాత్ జట్టును సోషల్ మీడియాలో అనుసరించడం మొదలు పెడుతున్నది. సిరాజ్ తో సం థింగ్ సం థింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆమె గుజరాత్ జట్టును అనుసరిస్తున్నదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే తమ ప్రేమపై జనై, సిరాజ్ ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీనిపై ఒక స్పష్టత రావాలంటే సిరాజ్ లేదా జనై స్పందించాల్సి ఉంది. కాగా, పుట్టినరోజు సందర్భంగా జనై కి నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఐతే ఓ యువకుడు మీరు సిరాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ జనై ని ప్రశ్నించాడు.. జనై ప్రస్తుతం సింగర్ గా కొనసాగుతోంది.. అయితే కాదు చత్రపతి శివాజీ మహారాజ్ అనే సినిమాలో నటిస్తోంది. కాగా, జనై పుట్టినరోజు వేడుకల్లో శ్రేయస్ అయ్యర్, సిద్దేశ్ లాడ్, సిరాజ్, ఆశా భోస్లే, జాకీ ష్రాఫ్, సుయాస్ ప్రభుదేశాయి, అయేషా ఖాన్ ( బిగ్ బాస్ కంటెస్టెంట్) సందడి చేశారు. జనై కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
View this post on Instagram