India vs Pakistan: క్రికెట్లో భారత, పాకిస్తాన్ ఆటంటే అభిమానులకు భలే క్రేజ్. మజా అంటే అందులోనే ఉంటుందని వారి భావన. క్రికెట్ అంటేనే పాకిస్తాన్ తో ఆడితేనే పసందుగా ఉంటుందని తెలిసిందే. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ వస్తుంది. సగటు ప్రేక్షకుడు టీవీ ముందు అతుక్కుని చివరికంటా ఎంజాయ్ చేసే ఆట. దీంతో భారత్ కు కప్పు రాకున్నా ఫర్వాలేదు కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ ఓడిపోవద్దనే కోరుకుంటాడు సగటు ప్రేక్షకుడు. ఈ నేపథ్యంలో భారత, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కు ఉన్న ప్రాధాన్యత అలాంటిది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆటంటే అభిమానులకు పండుగే. రెండు దేశాలు ఎప్పుడు ఢీకొన్నా థ్రిల్ ఫీలవుతుంటారు. ఈ క్రమంలో టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 24న మరోసారి రెండు జట్లు తలపడనున్నాయి. దాయాదుల పోరు కోసం ప్రపంచం యావత్తు ఆతృతగా చూస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ భారత, పాకిస్తాన్ మధ్య జరిగేది మ్యాచ్ కాదు ఓ యుద్ధమే అన్న ఫీలింగ్ లోకి వెళ్లడం ఖాయం. ప్రతి మూమెంట్ ను భలేగా ఎంజాయ్ చేసే సందర్భం.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా పాక్ ఆటగాళ్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పాకిస్తాన్ ఇండియాను ఓడిస్తే వారికి బ్లాంక్ చెక్ రెడీ గా ఉందని చెప్పడంతో ఈ మ్యాచ్ పై అంచనాలు మరింత పెరిగాయి. అటు ఇండియా, ఇటు పాక్ జట్లు తప్పకుంగా గెలవాలని తపనతో ఉన్నాయి. దీంతో ఆటపై అందరికి ఉత్కంఠ పెరుగుతోంది. రమీజ్ రాజా ఇచ్చిన ఆఫర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాక్ ఆటగాళ్ల ప్రబావంపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దాయాది దేశాల పోరుకు సర్వం సిద్ధమవుతోంది. విజయమే ప్రధానంగా రెండు జట్లు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. తమ దేశం ప్రతిష్ట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో గెలుపుపై అంచనాలు వేస్తున్నాయి. ప్రత్యర్థి జట్టును మట్టికరిపించే విధంగా ఎలా ఆడాలనే దానిపై పలు కోణాల్లో అధ్యయనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ తాడో పేడో తేల్చుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.